Breaking News

ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18వ తేదీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మచిలీపట్నం పర్యటన సందర్భంగా గురువారం కలెక్టర్ పి రంజిత్ భాష జిల్లా ఎస్పీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా పరిషత్ లో ఏర్పాట్లు పరిశీలించి, అనంతరం జడ్పీ హాలులో సమావేశం నిర్వహించి ఏ ఏ శాఖలు ఏ ఏ ఏర్పాట్లు చేయాలో సూచనలు ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు జడ్పీ ఆవరణలో ఏర్పాటుచేసిన మాజీ జడ్పీ చైర్మన్ కీ.శే. పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం వివిధ శాఖల సమన్వయంతో విజయవంతం చేయుటకు అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. జడ్పీ ఆవరణలో కాంస్య విగ్రహం వద్ద డయాస్ ఏర్పాటు చేయాలన్నారు. ఉపరాష్ట్రపతి రిమోట్ ద్వారా విగ్రహావిష్కరణ గావించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రజలు, ప్రజాప్రతినిధులు వీక్షించేందుకు అవసరమైనన్ని ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ బాగా కనపడే విధంగా డయాస్ తగినంత ఎత్తులో ఏర్పాటు చేయాలని, డయాస్ పై పిన్నమనేని కోటేశ్వరరావు చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. జడ్పీ కన్వెన్షన్ హాల్ ఆవరణలో విఐపి వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ముఖ్య అతిధి పొడియంకు సభ అంతా కనబడే విధంగా చూడాలన్నారు. ఉపరాష్ట్రపతి 17వ తేదీ సాయంత్రం 6.15 గం. గన్నవరం విమానాశ్రయం చేరుకుని, గన్నవరం మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రదేశంలో రాత్రి బస చేస్తారని, 18 తేదీ ఉదయం 9.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారని, 10 గంటల నుండి 11 గంటల వరకు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్ కు బయలుదేరు వేళతారని కలెక్టర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ తు.చ తప్పక పాటించాలని, పోలీస్ శాఖ ద్వారా తగిన బందోబస్తు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ వివిఐపి రూట్ మ్యాప్, కాన్వాయ్ సిద్ధం చేయాలన్నారు.

జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వి వి ఐ పి పర్యటించే రహదారి వెంబడి శానిటేషన్ చర్యలు, త్రాగునీటి సరఫరా చేయమన్నారు. విద్యుత్ శాఖ ద్వారా అవసరమైన జనరేటర్స్ ఏర్పాటు చేస్తూ కనీసం 8 గంటల బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో ఏ ఎస్ పి (ఏ ఆర్) ఎస్ వి డి ప్రసాద్, డి ఆర్ వో ఎం వెంకటేశ్వర్లు ఆర్డివో ఐ. కిషోర్, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, డీఎస్పీ మాసుం భాష వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *