Breaking News

5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే క్లియర్ వాటర్ సంప్ ప్రారంభం… : ఎమ్మెల్యే పేర్ని నాని

-తొలగనున్న ప్రజల నీటి కష్టాలు
-45 కోట్ల రూపాయలతో 11 ఓవర్ హెడ్ ట్యాంకులు
-ఈ నెలలోనే టెండర్లకు ఆహ్వానం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నామని, 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో క్లియర్ వాటర్ సంపు ఏర్పాటు ద్వారా మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగనున్నట్లు మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు.
బుధవారం ఉదయం ఆయన మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ వెంకటేశ్వరమ్మతో కలిసి వాటర్ సంప్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, గతంలో కోటి 60 లక్షల లీటర్ల నీటిని సుద్ధి చేసే సామర్ధ్యం పాతది ,ఆ తర్వాత 2 కోట్ల లీటర్ల నీటిని సుద్ధి చేసే కొత్తదితో కలిపి, మొత్తం 3 కోట్ల 60 లక్షల లీటర్ల ముడి నీటిని శుద్ధి చేస్తున్నామని అయితే, వాటికి సరిపడా సంప్ లు లేకపోవడంతో తక్కువ వ్యవధిలో ట్యాంక్ లు నింపలేని పరిస్థితి ఉందన్నారు. 14 వ ఆర్ధిక సంఘ నిధులు, జనరల్ ఫండ్ నిధులు కలిపి 1 కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే క్లియర్ వాటర్ సంప్ ను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కౌన్సిల్ అప్రూవల్ తో నేల స్వభావంను బట్టి 10 అడుగుల లోతుకు వెళ్లి కాంక్రీట్ పునాదితో బలిష్టంగా నిర్మించేందుకు సంప్ డిజైన్ సైతం మార్చడం జరిగిందన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితులలో కాంట్రాక్టర్ సంప్ నిర్మాణ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేశారన్నారు. దీంతో ప్రజలకు త్వరితగతిన అందుబాటులో తీసుకువచ్చిన మునిసిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ , కాంట్రాక్టర్ ను అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. రోజూ తాగునీటిని సరఫరా చేసే సామర్ధ్యం నగరపాలక సంస్థకు ఉన్నప్పటికీ మచిలీపట్నం జోనింగ్ విధానం లేకపోవడం చేత, నీటి సరఫరా ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రవహిస్తున్నాయో తెలియని గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మచిలీపట్నం ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం 45 కోట్ల రూపాయలు మంజూరు చేసారన్నారు.ఇప్పటికే మచిలీపట్నంలో 19 ఓవర్ హెడ్ ట్యాంక్ లు ఉన్నాయని వాటికి తోడు నూతనంగా మరో 11 ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆ నిర్మాణం పూర్తి కాబడితే జోనింగ్ విధానం అమలు అవుతుందన్నారు. రోజూ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల లోపు ట్యాంక్ లు నింపడం జరుగుతుందన్నారు. దీంతో ఏ ట్యాంక్ లో నీళ్లు వదిలితే , ఏ వీధి ఎక్కడ ఇళ్ల వరకు అవి చేరుకొంటాయనే స్పష్టత వస్తుందని దాంతో ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందించాలని తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ ఛైర్మెన్, నాలి శారద మాధవ్, పట్టణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ సలార్ దాదా, ముడా ఛైర్మెన్ బొర్రా నాగ భవానీ విఠల్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, మునిసిపల్ ఎం ఇ త్రినాధరావు, మహమ్మద్ రఫీ, పల్లె శేఖర్, రామ్ ప్రసాద్, మరీదు నాగరాజు, కో- ఆప్షన్ సభ్యులు మట్టా తులసి, పలువురు కార్పొరేటర్లు,డివిజన్ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *