Breaking News

అహింసను ప్రభోధించిన వర్ధమాన మహావీరుడు

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అహింసను ప్రబోధించిన వర్ధమాన మహావీరుడి ఆలోచనలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మ‌హావీర్ జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ జైన్ సమాజ్ ప్రముఖులు విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జైనుల‌కు ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో మ‌హావీర్ జ‌యంతి ఒక‌టని, పన్నెండు సంవత్సరాల పాటు వర్ధమానుడు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచార బాధ్యతలను చేపట్టాడన్నారు. సగటు వ్యక్తులకు అర్ధమయ్యే రీతిలో మంచి బోధనలను గావించిన మహావీరుడు సకల జనులు అందరికీ గురుతుల్యులేనని వివరించారు. మహావీరుని బోధనలను ఆచరణలో పెట్టినప్పుడే వాటికి సార్ధకత లభిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు 72వ ఏట మృతి చెందారని గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ను జైన్ సమాజ్ తరుపున సత్కరించారు. కార్యక్రమంలో జైన్ సమాజ్ పెద్దలు మనోజ్ కొఠారి, పబ్నాలాల్ జైన్, సుక్రజ్ జైన్, దినేష్ జైన్, కిషోర్ జైన్, నరేంద్ర జైన్, ఆశోక్ కుమార్, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *