Breaking News

పాఠశాలల్లో నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయాలని, పనులు జరిగే సమయంలో విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమీషనరు ఇజ్రాయిల్ పేటలోని బొర్రా నాగేశ్వరరావు మున్సిపల్ హై స్కూల్ ల్లో నాడు నేడు పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడి పనుల వేగవంతం పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత విద్యార్ధులతో మాట్లాడుతూ వారు చదివే తరగతి, పాఠశాల సమయాలు, మౌలిక వసతుల పై వివరాలు అడిగి తెలుసుకొని, వారి తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో ప్రశ్నలు అడిగి, వారు చెప్పిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో అనంతరం కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులను పాఠశాలకు నాడు నేడు లో ఎంత నిధులు మంజూరు అయింది, ఎన్ని గదులు నిర్మాణం చేస్తుంది అడిగి తెలుసుకొని, పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. పనుల వలన విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పనులని ఎమినిటి కార్యదర్శులు ఎప్పటికప్పుడు’ పరిశీలిస్తూ, పనుల్లో నాణ్యతా ప్రమాణాల్లో లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, డి.ఈ.ఈ.లు రమేష్ బాబు, కళ్యాణ రావు, ఏ.ఈ.లు, శానిటరీ ఇన్సెపెక్టర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *