Breaking News

పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, శానిటరీ కార్యదర్శులు మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. స్పష్టం చేశారు. గురువారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా సీతానగర్, అరుంధతి నగర్, ఇజ్రాయిల్ పేట, మణిపురం, బ్రాడిపేట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన సి.సి. రోడ్లు, డ్రైయిన్ పనుల నాణ్యతలను తనిఖీ చేసి అధికారులకు, సచివాలయ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత పారిశుధ్య కార్మికులతో సీతానగర్ లో పారిశుధ్య కార్మికులతో ఇంటింటి చెత్త సేకరణ ఎన్ని గంటలకు చేస్తుంది, తడి పొడి వేరుగా ఎన్ని గృహాల నుండి ఇస్తుంది, కమర్షియల్ సంస్థల నుండి చెత్త సేకరణ, గ్యాంగ్ వర్క్ పై వివరాలు అడిగి తెలుసుకొని, నిర్దీషిత సమయంలో ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరగాలని స్పష్టం చేశారు. శానిటేషన్ కార్యదర్శులు పుష్ కాట్ వెంబడి వెళ్లి ప్రజలకు తడి పొడి చెత్త విభజన, నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదని అవగాహన కల్గించాలని ఆదేశించారు. కమర్షియల్ సంస్థల నుండి నిర్దేశిత వాహనంలోనే చెత్త సేకరణ చేయాలని, రోడ్ల మీద వేసే సంస్థల సీజ్ చేయాలన్నారు. అనంతరం సదరు ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టక పోవడం, నిషేధిత ప్లాస్టిక్ గ్లాస్ లు వినియోగం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబందిత ప్రాంత శానిటేషన్ సూపర్వైజర్ ని విదుల నుండి తొలగించాలని, కార్యదర్షుకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
సీతానగర్, ఇజ్రాయిల్ పేట, బ్రాడిపేటల్లో నిర్మించిన సి.సి.రోడ్డు, డ్రైయిన్, సి.సి.రోడ్ ప్యాచ్ వర్క్ లను యం.బుక్ ప్రకారము పరిశీలించి, సిమెంట్ రోడ్డు నాణ్యతను రీ బౌండ్ హ్యామర్ తో తనిఖీ చేశారు. పనుల నాణ్యతా పరిశీలనలో ప్రతి అంశాన్ని యం.బుక్ లో రికార్టు చేయాలని, అన్నిదశలలోను జరిగే పనులను ఫోటోలతో ఫైలు మెయింటైన్ చేయాలన్నారు. టెండర్ పొంది అగ్రిమెంట్ ప్రకారం పనులు పక్కాగా జరగాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సచివాలయాల వారిగా పనులను ఏమినిటీ సెక్రటరీలు ఎప్పటికప్పుటు పర్యవేక్షిస్తూ ఇంజినీరింగ్ అధికారులకు పనుల పురోగతిపై వివరములు అందించాలన్నారు.
అనంతరము సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రతి నిర్మాణం నగరపాలక సంస్థ నుండి తీసుకున్న ప్లాన్ ప్రకారమే ఉండాలని, అనధికార నిర్మాణాలు, లే అవుట్స్ ఉంటే ప్లానింగ్ కార్యదర్శి పై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి నిర్మాణం అసెస్మెంట్ కల్గి ఉండాలని, నూతన భవనాలకు ఎప్పటికప్పుడు పన్ను విధించాలని అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ. సుందర్రామిరెడ్డి, డి.ఈ.ఈ.లు రమేష్ బాబు, కళ్యాణ రావు, శ్రీనివాసరెడ్డి, మహ్మద్ రఫిక్, ఏ.ఈ.లు, శానిటరీ ఇన్సెపెక్టర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *