Breaking News

జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటాం..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ముక్త్యాల – మాదిపాడు బిడ్జి నిర్మాణానికి అప్రోచ్‌ రోడ్డు స్థల సేకరణ, పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ, కమ్యూనిటీ భవన నిర్మాణం, రహదారి విస్తీరణలో భూమి కొల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారం పై గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ప్రభుత్వ విప్‌, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో శాసనసభ్యులు సామినేని ఉదయ భాను మాట్లాడుతూ జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద గుంటూరు జిల్లా మాదిపాడును కలుపుతూ కృష్ణానదిపై 68 కోట్ల రూపాయల నాబార్డ్‌ నిధులతో వంతెన నిర్శించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. ముక్త్యాల వద్ద అప్రోచ్‌ రోడ్డు కు స్థలాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలిని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. సత్యనారాయణపురం పుంత స్థలం, పద్మావతి నగర్‌ గుట్ట స్థలం, దుర్గాపురం ఊరచెరువు, చిరు నగర్‌, వైవై కాలనీ, విద్యానగర్‌, క్రీిస్టియన్‌పేట, మిట్టగూడెం, తదితర ప్రాంతాలలో అనాధిగా పేద ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. పేదలు నివాసం ఉంటున్న భూములను నిషేదిత జాబితాలో నుంచి తొలగించి ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. గ్వార్‌బాయ్‌ సేవాసంఫ్‌ు వారికి జగ్గయ్యపేట పరిధిలో కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు 25 సెంట్ల భూమిని కేటాయించాలన్నారు. జగ్గయ్యపేట సమీపంలోని నేషనల్‌ హైవే వద్ద తరచు రోడ్డ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని క్షతగ్రాతులకు సత్వర చికిత్సను అందించేందుకు చిల్లకల్లు గ్రామ పరిధిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయవలసి ఉందని ఇందుకు అవసరమైన 2 ఎకరాల 35 సెంట్ల భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.పెనుగంచిప్రోలు మండలం పొన్నవరం గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల వారికి కమ్యూనిటి హాల్‌ నిర్మాణం, స్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని శాసనసభ్యులు ఉదయభాను కోరారు.
జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ముక్త్యాల` మాదిపాడు వద్ద నిర్మించే బిడ్జికి అప్రోచ్‌ రోడ్లుకు స్థలాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్‌డివోకు సూచించారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని అధిక శాతం భూములు రెవెన్యూ రికార్డులలో ఈనాం భూములుగా నమోదై భూములో వ్యవసాయం చేస్తున్న రైతుల ఇబ్బందులను తొలగించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఇటీవల ఈనాం భూములను సర్వీస్‌ ఈనాం భూములుగా మార్చి ఆయా రైతులకు కూడా వ్యవసాయ రుణాలు, రైతు భరోసా, సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈనాం భూములకు సంబంధించి సిసిఎల్‌ఏ పరిధిలో ఉందన్నారు. పేద ప్రజలు నివాసం వుంటున్న నిషేదిత భూములకు సంబంధించి స్థానిక రెవెన్యూ అధికారులతో రికార్డులను పరిశీలించి తగు చర్యలను తీసుకుని పట్టాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. వత్సవాయి మండలం మంగొల్లు, నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామాలలోను, జగ్గయ్యపేట పట్టణంలోను అనాదిగా ప్రభుత్వ పోరంబోకు నిషేదిత భూములలో తాత్కాలికంగా ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్న పేద ప్రజలకు శాశ్వత నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.
సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, నందిగామ ఆర్‌డివో రవీంద్రరావు, జగ్గయ్యపేట మున్సిపల్‌ కమీషనర్‌ రంగాపురం రాఘవేంద్ర, జగ్గయ్యపేట, నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు తహాశీల్థార్లు ఎన్‌. నాగరాజు, ఎస్‌.నరసింహరావు, పి. వైకుంఠరావు, లక్ష్మీ కళ్యాణి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *