Breaking News

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేటి నుండి అమలు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికలతో పాటు లోకల్ బాడి ఎన్నికలు ఇదివరకు చిత్తూరు జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో, నెల్లూరు కు సంబంధించి 14 మండలాల్లో కూడా జరగనున్నాయి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో మండలి ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ ఈ ఆర్ ఓ లతో , ఏ ఈ ఆర్ ఓ లతో సమీక్ష నిర్వించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ మండల పరిధిలో, మునిసిపల్ పరిధిలో వెంటనే ఏర్పాటు కావాలని అన్నారు. నేటి నుండే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అనుసరించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ రోజువారీ ఇవ్వనున్న ఆదేశాలు పాటించాలని అన్నారు. ఎం సి సి టీమ్ వీడియో కవరేజ్ చూడాలని అన్నారు. డూప్లికేట్ ఓటర్లు తొలగింపు , ఈ నెల 10వరకు అందే క్లైములు పరిశీలన చేయాలని అన్నారు. ఈ ఆర్ ఓ లు అనుసంధాన ( అక్సిలరి) పోలింగ్ కేంద్రాల లో సౌకర్యాలు చూడాలని అన్నారు. మండల స్థాయిలో , నియోజక వర్గ స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి అన్నారు. తప్పని సరి పోలింగ్ కేంద్రాలు మరోసారి పరిశీలించాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియలో విధుల నిర్వహణ అధికారుల, సిబ్బంది జాబితా జిల్లా ట్రెజరీ నుండి సేకరించాలని రాండమైజేషన్ చేయాల్సి వుంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణ శిక్షణ నిర్వహించాలని అన్నారు. నిర్వహణ మెటీరియల్ టెండర్ జేసి చూడాలని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు గా కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని అన్నారు. గొడౌన్ల గుర్తింపు, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు పూర్తి స్థాయిలో గుర్తింపు జరగాలని అన్నారు. ఈ సమీక్ష లో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఏ ఓ సుబ్రమణ్యం,ఈ ఆర్ ఓ లు , ఏ ఈ ఆర్ ఓ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *