తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 9వ తేదీన వెట్టిచాకిరి నిర్మూలన చట్టం, 1976 అమలులోనికి వచ్చినందున 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి 15 వ తేదీ వరకు G.O.No.1, తేదీ 08-02-2023 Labour Factories Boilers and IMS (Lab.I) Department ప్రకారం వెట్టి చాకిరీ నిర్మూలన వారము “ఆపరేషన్ స్వేచ్ఛ“ నిర్వహించాలని కార్మిక కమీషనరు, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లాలోని ఉప కార్మిక శాఖ కమీషనరు, సహాయ కార్మిక కమీషనరు మరియు కార్మిక శాఖ అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్ మరియు లైన్ డిపార్ట్మెంట్ వారు వెట్టి చాకిరీ నిర్మూలన వారము” ఆపరేషన్ స్వేచ్ఛ” ని ఈ రోజు అనగా ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభించినారనీ ఉప కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవరసర సహాయము కోసం: జిల్లా కలెక్టరు / సబ్ కలెక్టరు / రెవెన్యూ కమీషనరు / అసిస్టెంట్ కమీషనరు ఆఫ్ లేబరు (ఎన్.పోర్స్.మెంట్) / జిల్లా మరియు డివిజన్ స్థాయి విజిలెన్స్ కమిటీలు / పోలీసు స్టేషన్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఆశ్రయించవలెనని కోరారు.
అనంతరం నేటి సాయంత్రం వెట్టి చాకిరి నిర్మూలనపై పోస్టర్ ను స్వేచ్ఛ బ్యానర్ ను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ ఛాంబర్ నందు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమీషనరు కృష్ణా రెడ్డి, భవన నిర్మాణ రంగ ఎస్ ఎస్ పి ఓ సహాయ కార్మిక కమిషనర్ చిన్న లాలప్ప, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News