Breaking News

రైల్వే మరియు జాతీయ రహదారుల పై సమీక్షించిన కేంద్ర అధికారులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే మరియు జాతీయ రహదారుల కు సంబంధించిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ, బడ్జెట్ విడుదల పలు అంశాలపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజి, న్యూఢిల్లీ నుండి కేంద్ర అధికారులు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కలెక్టర్లు, జేసీలు, జాతీయ రహదారుల అధికారులతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి, రహదారులు భవనాల శాఖ సెక్రెటరీ ప్రద్యుమ్న హాజరవగా తిరుపతి జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన 250 ఎకరాల భూములకు సంబంధించిన పరిహారం బడ్జెట్ విడుదల గురించి రోడ్లు భవనాల సెక్రెటరీ ప్రద్యుమ్న కేంద్ర అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై సమీక్షించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టరేట్ సిబ్బంది భూ సేకరణ సూపరింటెండెంట్ శాంత కుమారి, డి టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుపాను హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి

-ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి -అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలి -పంచాయతీరాజ్, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *