రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి – మంత్రి గొట్టిపాటి రవి కుమార్

-లైన్ మెన్ రామయ్యను అభినందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
-వరద ఉద్ధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన రామయ్య
-రామయ్య సాహసం ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయమని మంత్రి కితాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు.

భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజాసంబంధాలను కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న లైన్ మెన్ కూర రామయ్య వరద ఉద్ధృతిని కూడా లెక్క చేయకుండా… విద్యుత్ పునరుద్దరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *