శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎర్ర కాలువ వరద ముంపు నివారణకు ఆధునీకరణ పనులను చేపడతాం.

-వరద ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటన
-రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతులకు అండగా ఉంటాం
-రైతులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను రూ.1680 కోట్లులో ఇప్పటికే రు. 1000 కోట్లు రైతులకు జమ చేసాం.
-మరో వారంలో మిగిలిన రు. 680 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం
-వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేం నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, పర్యాటక, సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర కాలువ వరద ముంపు నివారణకు తక్షణ పనులు యుద్ధప్రాతిపదికన , శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, హోం మంత్రి వంగాలపూడి అనిత, పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు పేర్కొన్నారు.

ఆదివారం రాష్ట్ర మంత్రులు  కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత,  కందుల దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బూరుగుపూడి శేషారావు, వ్యవసాయ శాఖ కమీషనర్ డిల్లీ రావు, జిల్లా కలెక్టర్ పి.  ప్రశాంతి , జేసి ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవలు నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం, నిడదవోలు మండలాలు లోని సూర్య రావు పాలెం, పసలపూడి కాల్దారి, తాళ్లపాలెం , కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి దైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చం నాయుడు మాట్లాడుతూ ఎర్ర కాలువ వరద ఉధృతి వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాలు పంట ముంపుకు గురై పంట నష్టం ఏర్పడడం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎర్ర కాలువ జంగారెడ్డిగూడెంలో మొదలై భీమవరం శివారు వరకు ముంపు ప్రభావం ఉంటుందని, దీనివలన 20 మండలాల్లోని గ్రామాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం జరుగుతుందన్నారు. ఎర్రకాలువ ముంపు నివారణకు తక్షణ , మధ్యస్థ ,శాశ్వత పరిష్కారము దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేసి ఆధునికరణ పనులు చేపట్టి ముంపు నివారణను అరికట్టడం జరుగుతుందన్నారు. ఎర్రకాలువ వరద ముంపు నివారణ పనులను మూడు అంచెలలో చేపట్టడం జరుగుతుందని ముందుగా ఏటిగట్టు గుంతలను పూడ్చడం, తదుపరి సుయిజ్ తలుపులు మరమ్మతులు చేపట్టం జరుగుతుందని, మూడవ దశలో ఇరిగేషన్ శాఖ సమన్వయంతో ఎర్ర కాలువ ముంపు నివారణ లక్ష్యంగా పనులు చేపడతా మన్నారు. ఎన్ని కోట్లు ఖర్చయిన చేపట్టి ప్రభుత్వ అంకితభావం, చిత్తశుద్ధితో మోడ్రైజేషన్ పనులను వచ్చే సీజన్లో పూర్తి చేస్తామన్నారు.

గత ప్రభుత్వం వ్యయానికి మించి రూ. 12 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రతి శాఖ లో అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అపారమైన అనుభవం ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చెందిలా సంపదని సృష్టిస్తారని మంత్రి పేర్కొన్నారు.

ఎన్ డి ఎ కూటమీ దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని బలపచ్చారన్నారు. అధికారం వచ్చిన 48 రోజులుగా ఎంతో బాధ్యతాయుతముగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖల వారి సమీక్షలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను హతః పాతాళ లోకానికి తొక్కి గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్ధిక పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని లక్ష్యంతో గత 48 రోజుల్లో 7 వైట్ పేపర్లను రిలీజ్ చేసావన్నారు. గత ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చిందన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు సంతకాలు చేసి నాలుగు పథకాలను ప్రజలకు అందించే దిశగా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఏప్రిల్ నుండి ఏరియల్ తో సహా జూలై మాసంలో నాలుగు వేలు కలుపుకొని రు. 7వేల రూపాయలు లబ్ధిదారులకు అందించామన్నారు. రైతాంగానికి నష్టం కలిగించే ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని శాసనసభ ఆమోదంతో రద్దుచేసి రైతాంగానికి మేలు చేశామన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి 100 చోట్ల అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించే విధంగా ప్రతిపాదించడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు సంభందించి రు. 1680 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాలను మా ప్రభుత్వం వచ్చాక నాబార్డు ద్వారా రు. 1000 కోట్లు రైతులకు జమ చేయడం జరిగిందన్నారు. మరో వారం రోజుల్లో రు. 680 కోట్లు రైతులు ఖాతాలకు జమ చేయడం  జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా రు. 39,500 కోట్లు అప్పులు చేసి ఇతర కార్యక్రమాలను ఖర్చు చేశారని   మంత్రి తెలిపారు.

ప్రకృతి విపత్తులు భారీ వర్షాలు వరదల కారణంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని,  ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముంపు నివారణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని విపత్తులు మరియు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్షలు నిర్వహించారన్నారు.

గత ప్రభుత్వం ఎర్రకాలువ ఏటి గట్టుపై తట్టేడు మట్టి కూడా వేయక పోవడం వలన నేడు వేలాది  ఎకరాలు ముంపు బారిన పడ్డాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి పునరావస కేంద్రాల్లో ఉన్న వారిని, ముంపు బారిన పడి పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి ధైర్యం చెప్పమని పంపడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో బృందాలుగా ఏర్పడి వరద ముంపు ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ  పంట నష్టాలను పరిశీలిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రకాలు ముంపు కారణంగా నష్టపోతున్న పంటల వివరాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కింజరాపు  అచ్చం నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్లతో కలసి తాళ్లపాలెం గ్రామంలో వరద ముంపు బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి  కింజరాపు అచ్చన్నాయుడు వెంట  హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి వంగలపూడి అనిత, పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *