-ఆక్రమణల విషయంలో తొలగింపు చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-ట్రాఫిక్ డి ఎస్పీ వేంకటేశ్వర రావు తో కలిసి నగరంలో తనిఖీలు చేపట్టాం
-కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఆక్రమణల తొలగింపు నేపధ్యంలో పోలీసు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయనున్నట్లు మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఆదివారం నగర పాలక సంస్థ అధికారులు పోలీసులు అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పూర్తి నియంత్రణ నేపద్యంలో క్రమబద్ధీకరణ చేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్దం చేసి ఆక్రమణ తొలగింపులకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. నగరంలోని అన్ని సిటీ కెమెరాలను పనిచేసే విధంగా అన్నారు. 2027 లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం ఆమోదించిన ప్లాన్ ను అనుసరించి నిర్మాణాలు ఉండాలని, రహదారుల ఆక్రమణ చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు.
నగరంలో ఆటోలకు, వాహనాలకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, అపరాధ రుసుం వసూలు చేస్తామని అన్నారు. పలువురు ఆటో డ్రైవర్లకు కమిషనర్ అవగాహన కలుగ చేశారు.
Prajavartha Online Telugu News