Breaking News

ఉచిత వైద్య శిబిరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు తూర్పు గోదావరి జిల్లా డి.ఎం.హెచ్.వో. వారి సమన్వయంతో స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఉన్న ఎస్.టి మహిళా హాస్టల్ నందు విధ్యార్థినిలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు విధ్యార్ధినిలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఈ.సీ.జీ., బీ.పీ, షుగర్, హెమోగ్లోబిన్, మొదలగు పరీక్షలు నిర్వహిస్తున్నామని, విధ్యార్దినిలందరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పరీక్షల అనంతరం విధ్యార్దినిలకు మందులు అందజేశారు.

ఈ వైద్య శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డి. అలేఖ్య , స్టాఫ్ నర్స్ కె. శారద , ల్యాబ్ టెక్నీషియన్ వై. బాలదుర్గా , ఏ.ఎన్.ఎం రాజ్యలక్ష్మి , ఆశా కార్యకర్తలు కె. బేబీ, కె. కరుణ తో పాటు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *