విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 63 వ డివిజన్ రాజీవ్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద గురువారం సెంట్రల్ SC సెల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జయపాల్ ఆధ్వర్యంలో బి.ఆర్. అంబేద్కర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ గావించి పూలమాలవేసి నివాళులర్పించి 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలను ముందుకు తీసుకొని వెళుతూ రాష్ట్రంలోని ప్రజలందరికి సంక్షేమం అందే విధముగా దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేట్టిన 5 రూపాయలకే కడుపునిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ వంటి మంచి కార్యక్రమాలు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బొండా ఉమ స్మరించుకుంటూ దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని,దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని,ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే, అంబేద్కర్ మహనీయునికి మనం ఘన నివాళి అర్పించగలమని తెలియజేసారు.
ఈ కార్యక్రమాలలో ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ, వేల్పుల రాజేష్, లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, కోలా శ్రీను, మోత్కూరు కాసి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News