గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలలో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గురువారం సాయంత్రం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి ఆర్అండ్బి అధికారులకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ సూచనలు అందించారు. గ్రామంలో ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనుల పై సూచనలు అందించారు. అనంతరం పొన్నేకల్లు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అధికారులు చేపట్టవలసిన పనులపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. సివిల్ పనులన్నీ కూడా ఆర్అండ్బి మరియు పంచాయతీ రాజ్ అధికారులు రేపటి లోపు పూర్తి చేయాలన్నారు. చక్కటి శానిటేషన్ పనులను డిపిఓ చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, బ్యారీకేడ్ పనులను సజావుగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే అతిధిదులకు, స్థానిక ప్రజలకు స్నాక్స్, మంచి నీరు వంటివి అందించేందుకు తగు చర్యలు చేపట్టాలని డిఎస్ఓ కు సూచించారు. కార్యక్రమం ప్రారంభం నుండి పూర్తి అయ్యేవరకు నిరంతర విద్యుత్చ్చక్తి సరఫరా ఉండేటట్టు ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పొన్నేకల్లు గ్రామంలో రాష్ట్ర స్థాయి డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి జయంతి ఉత్సవాలలో రాష్ట్ర గౌ.ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్న దృష్ట్యా అధికారులందరు సమన్వ్యంతో, క్రమశిక్షణ తో కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అరుధైన కార్యక్రమమన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పేదరికం లేకుండా రూపు మాపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన పి4 మార్గదర్శి-బంగారు కుటుంబం కాన్సెప్ట్ తో కార్యక్రమం జరుగనున్నందున అందుకు తగ్గ ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమం విజయవంతానికి తన వంతు సహకారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ప్రశాంతంగా, చక్కగా నిర్వహించేదుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి మురళి కృష్ణా, సిపిఓ శేషశ్రీ, డి ఆర్ డి ఏ, డ్వామా, మెప్మా పి డి లు విజయలక్ష్మి, శంకర్, డిపిఓ నాగసాయి, మెప్మా పి డి విజయలక్ష్మి, ఈడిర ఎస్సి కార్పొరేషన్ దుర్గాబాయి పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, గుంటూరు పశ్చిమ మండల తాసిల్దార్ వెంకటేశ్వర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News