Breaking News

కమ్యూనిటీ విజిలెన్స్ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను మాదక ద్రవ్యాల వినియోగ రహితంగా తీర్చిదిద్దేందుకు సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన, ఎన్ ఫోర్స్ మెంట్, కమ్యూనిటీ విజిలెన్స్ కార్యక్రమాలు పటిష్ట ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ తేజ ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ సీ ఓ ఆర్ డీ ) జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఏ భార్గవ తేజ మాట్లాడుతూ జిల్లాలో నిషేదిత మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలు పై కేసులు నమోదు అవుతున్నాయని, ముఖ్యంగా యువత, విధ్యార్ధులు వీటిని వినియోగిస్తున్నారన్నారు. యువత మత్తుపదార్ధాలకు బానిసకావటం వలన వారు వ్యక్తిగతంగా నష్టపోవటంతో పాటు సమాజంలోను తీవ్రమైన దుష్పరిణామాలు, ఇబ్బందులు ఉత్పన్నమవుతాయన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను పోలీసులను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం సంబంధిత శాఖల అధికారుల సహాయంతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. నిషేదిత మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలపై సమస్యాత్మక ప్రాంతాల్లోను, విద్యాసంస్ధల్లోను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోను, కళాశాలలోను, ఉన్నత విధ్యాసంస్థల్లోను విధ్యార్ధులు ఆకర్షణలకు గురై మత్తు పదార్దాలకు అలవాటు పడకుండా నిరంతరం అవగాహన పర్యవేక్షణ కోసం పోలీస్ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈగీల్ క్లబ్ లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోను పోలీస్, పంచాయితీ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోను ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మత్తుపదార్ధల వినియోగం పై కమ్యూనిటీ విజిలెన్స్ ద్వారా సమాచారం సేకరించి వాటిని అరికట్టేందుకు పోలీస్ శాఖకు, సంబంధిత అధికారలకు సమాచారం అందించాలన్నారు. మత్తుపదార్ధాలకు బానిసలైన వారికి వైద్యార్యోగ్యశాఖ ద్వారా నిర్వహించే డీ ఎడిక్షన్ సెంటర్ల లో చేర్పించి వారికి చికిత్స అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తుపదార్ధాలు వినియోగం వలన కలిగే అనార్ధలపై యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా విద్యాసంస్థల్లో ఫ్లాష్ మాబ్ లు, ర్యాలీలు, వివిధ రకాల పోటీలు నిర్వహించటానికి ప్రణాళికలు రూపొందించాలన్నరు. ఇతర ప్రాంతాల్లోను మత్తుపదార్ధాలు బస్సులలో రవాణా జరగకుండా రవాణాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. జీజీహెచ్ లో మత్తు పదార్ధాలకు అలవాటు పడినవారికి ప్రత్యేకంగా డీ ఎడిక్షన్ సెంటరు ఏర్పాటుతో పాటు, మత్తు పదార్ధాలను తీసుకున్నట్లు నిర్ధారించే ర్యాపిడ్ కిట్లు సమకూర్చుకోవాలన్నారు. మత్తు పదార్ధాలను విక్రయించే వారిని, వాటిని వినియోగిస్తున్నవారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత విధ్యాసంస్థలలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని విధ్యార్ధులు మత్తు పదార్ధాలకు అలవాటు పడకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు కఠినంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు, విద్యాసంస్థల నిర్వాహకులు, స్వఛ్చంధ సంస్థ ప్రతినిధులు అవసరమైన సహకారాన్ని అందించాలన్నారు.
జిల్లా ఎస్పీ సతీష్ కుమర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నిషేదిత మాదక ద్రవ్యాలను అమ్మకాలు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి విచారించినప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లోని విధ్యార్ధులకు అమ్మటానికే వీటిని తీసుకువచ్చినట్లు తెలిసిందన్నారు. ఉన్నత విద్యాసంస్థలు ముఖ్యంగా యూనివర్సీటీలలో విద్యను అభ్యసిస్తున్న ఇతర ప్రాంతాల విధ్యార్దులు కళాశాల హాస్టల్స్ లో కాకుండా స్వంతంగా ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్న వారి వివరాలను అందిస్తే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయటం జరుగుతుందన్నారు. విధ్యా సంస్థల్లో ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేసి నిషేదిత మత్తు పదార్ధలు విద్యార్దులు వినియోగించకుండా నిరంతరం నిర్వహకులు పర్యవేక్షించాలన్నారు. మత్తు పదార్ధాల వినియోగం పై సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీసు శాఖ కు తెలియచేయాలన్నారు.
నిషేదిక మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనార్ధాలపై పోలీస్ శాఖ రూపొందించిన ఈగల్ ప్రచార పోస్టర్లను జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి ఆవిష్కరించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజా వలి, అడిషనల్ ఎస్పీ జీవీ రమణ మూర్తి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మీ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా, ఆర్డీవో శ్రీనివాసులు, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ లక్ష్మణ్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కో ఆర్ఢినేటర్ విజయ్ ప్రకాష్ , జిల్లా జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, ఆర్టీసీ ఆర్ ఎం కృష్ణ కాంత్, గుంటూరు ఆర్టీవో సత్యన్నారాయణ ప్రసాద్, తెనాలి ఆర్టీవో శ్రీహరి, మెప్మా పీడీ విజయలక్ష్మీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ షరీఫ్ , విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీ సువార్త, ఆచార్య నాగర్జున యూనివర్సీటీ ఓఎస్డీ రవికుమార్ , ఎస్ ఆర్ ఎం ఏపీ యూనిర్సీటీ స్టూడెంట్ ఎఫైర్స్ డైరక్టర్ రేవతి, విజ్ఞాన్ యూనివర్సీటీ తరుపున డా. విజయభాస్కర్, కేహెచఐటీ తరుపున డా. వెంకటరావు, వివిధ యూనివర్సీటీల ప్రతినిధులు, స్వఛ్చంద సేవాసంస్థల ప్రతినిధులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *