Breaking News

మాదిగ కులస్తుడైన సింగయ్య కుటుంబానికి వైయస్ జగన్ రెండు కోట్లు ఇవ్వాలి…

-ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 18న రెంటపాళ్ళ గ్రామ పర్యటనకు వెళుతుండగా జనం తొక్కిసలాటలో, కారు కింద పడిన సింగయ్య విషయంలో వై ఎస్ జగన్ స్పందించి, ఆసుపత్రికి తీసుకుని వెళితే బ్రతికేవాడని, వైయస్ జగన్ నిర్లక్ష్యమే సింగయ్య మృతికి కారణమని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరి గిన విలేకరుల సమావేశంలో, పేరుపోగు వెంకటేశ్వరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ, ఏపీ పోలీసులు వంద మందితో వెళ్ళమని ముందుగా చెప్పిన వైయస్ జగన్ వినకుండా కనీస జాగ్రత్తలు పాటించకుండా, కారు కింద పడి వ్యక్తి ని ఆసుపత్రిలో చేర్చకుండా రోడ్డు ప్రక్కన వదిలేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆ ర్యాలీ వల్ల మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఎన్నికల బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డ అగ్రకులానికి చెందిన మీ అభిమాని కుటుంబాన్ని పరామర్శించడానికి ఊరేగింపుగా వెళ్లిన వైఎస్ జగన్, నిన్ను చూడటానికి వచ్చి నీపై పూలు చల్లే క్రమంలో దళితుడైన మీ అభిమాని కారు కింద పడి సింగయ్య చనిపోతే ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని పేరుపోగు నిలదీశారు. పుష్ప సినిమా చూడటానికి ర్యాలీగా వెళ్లవద్దని, తెలంగాణ పోలీసులు హెచ్చరించిన, అల్లు అర్జున్ వినకుండా వెళ్ళడం వల్లే ఒక మహిళ, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కుమారుడు ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నాడని, ఆ కుటుంబానికి అల్లు అర్జున్ రెండు కోట్లు డబ్బులు ఇవ్వటం జరిగిందని, ఏపీలో సింగయ్య ప్రాణం ఖరీదు పదిలక్ష లేనా? అని వై ఎస్ జగన్ ను, పేరుపోగు ప్రశ్నించారు. అల్లు అర్జున్ తరహా లోనే వైయస్ జగన్,సింగయ్య కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పేరుపోగు డిమాండ్ చేశారు. డా సుధాకర్,సుబ్రహ్మణ్యం, సింగయ్య వంటి దళితుల శవాలతోనే పాలకులు ఎవరైనా రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి మానవత్వంతో సింగయ్య కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పేరుపోగు కోరారు. ఈ సమావేశంలో ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి, బేరి శెట్టి నీలా, సింగంపల్లి హనుమంతరావు, పెద్దాడి జయరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *