విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేదప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని, అందుకే నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు …
Read More »Konduri Srinivasa Rao
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలలో ఒగ్గు గవాస్కర్ దాతృత్వం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం 32 వ డివిజన్ అయోధ్య నగర్ ఏరియా నందు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై యెస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, చేసి తదనంతరం కరోనా కష్టకాలంలో అలుపెరగకుండా కష్టపడిన …
Read More »11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు …
Read More »పేద ప్రజల సంక్షేమ పథకాల సంక్షేమ రారాజు వైయస్సార్… : కర్ర జయ సరిత
పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు పాలకొల్లులో వైయస్సార్ సిపి నాయకురాలు, న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కర్ర జయ సరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్ర జయ సరిత మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అభివృద్ధిని జెట్ స్పీడ్ వేగంతో పరుగులు పెట్టించి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి బ్రాండ్ అంబాసిడర్ …
Read More »ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి మెలిసి జీవించాలి… : మేదర సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి, మెలిసి జీవించాలని బైబిల్ లో ఉందని వరల్డ్ హీలింగ్ డే రాష్ట్ర కో ఆర్డినేటర్ మేదర సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ హీలింగ్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేదర సురేష్ కుమార్ మాట్లాడుతూ 148 దేశాలు ప్రపంచ పుస్తక దినోత్సవం ని జరుపుకుంటూ మానవులందరూ కలిసిమెలసి జీవించాలని ఇప్పుడున్న ఈ సమయంలో ఎన్నో …
Read More »ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే… : పవన్ కల్యాణ్
-జనసేన బలోపేతానికి కృషి చేయాలి… -జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ‘‘కరోనా విపత్తులో …
Read More »ప్రతి ఒక్కరిలోనూ ధీమా పెంచిన ఆనందయ్య మందు…
– ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నివారణకు ఆనందయ్య మందు తీసుకున్నప్పటికీ వాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాల్సిన అవసరం ఉందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలిపారు. ఆనందయ్య మందు తీసుకుంటే వాక్సిన్ అవసరం లేదనే జరుగుతున్న ప్రచారం సరైనదికాదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వాక్సిన్ తో పాటు ఆనందయ్య మందు కూడా తీసుకుంటే మరింత మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఏపీ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సహకారంతో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో 300 మంది …
Read More »వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్,ఎచీవ్మెంట్ కింద 63 అవార్డులు ప్రకటన…
-వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుకు రూ.10లక్షలు నగదు,జ్ణాపిక -వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5లక్షలు నగదు, జ్ణాపిక -ఆగష్టు 14 లేదా 15వతేదీన అవార్డులు ప్రధానం -పూర్తిపారద్శకత నిష్పాక్షికతతో అవార్డులకు ఎంపిక ప్రభుత్వ సలహాదారు కమ్యునికేషన్స్ జివిడి కృష్ణమోహన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021 ఏడాదికి సంబంధించి వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ కింద 63 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో …
Read More »అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిరళ కృషి చేసిన వైఎస్సార్…
-రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో కృషి చేశారని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి నేపథ్యంలో గవర్నర్ సందేశం విడుదల చేస్తూ సమాజంలోని అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున సేవ చేయాలని ఆయన గట్టిగా విశ్వసించారన్నారు. సమైఖ్య రాష్ట్రంలోని చేవెల్ల నుండి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి …
Read More »నిరాడంబరంగా గవర్నర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుక…
-శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతుల 56వ వివాహ వార్సికోత్సవ వేడుక విజయవాడ రాజ్ భవన్ లో బుధవారం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులు, ఆహ్వానితులను అంగీకరించలేదు. కేవలం రాజ్ భవన్ ఉన్నతాదికారులు మాత్రమే గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు గవర్నర్ …
Read More »