-ఢిల్లీలో ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(ఆర్‌ఐఎన్‌ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి …
Read More »Andhra Pradesh
వ్యవసాయ రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట…
-రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం…. -సహకార రంగం ఇలోపేతంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం…. -రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాయి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగాన్ని బలోపేతం చేయాడమే ఒక పెద్ద లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో …
Read More »శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మ వారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్…
పెనుగచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రవీణ్ చంద్ అమ్మ వారిని దర్శనం చేసుకోగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
Read More »ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, విజయవాడ వారు శుక్రవారం విజయవాడ డివిజన్ లోని మండలములైన నందిగామ, పెనుగంచిప్రోలు మండలములను సందర్శించి, తహశీల్దార్ కార్యాలయములలో ఫీవర్ సర్వే, సర్వేలియన్స్ టీం లతో సమావేశమును ఏర్పాటు చేసి, వారికి తగు సూచనలు ఇచ్చియున్నారు, వాలెంటీర్స్, సచివాలయ సిబ్బందికి విదిగా ప్రతి ఇంటిని సందర్శించి కోవిడ్ 19 మరియు అనారోగ్యము యొక్క లక్షణములు కలవారిని గుర్తించవలసినదిగా ఆదేశించియున్నారు. మరియు పోలీస్ శాఖ వారికి మాస్క్ లేకుండా ఎవరైనా సంచరించినట్లైతే …
Read More »విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ, అంగన్‌వాడీలలో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… అధికారులకు సీఎం వైయస్.జగన్ కీలకమైన అదేశాలు జారీ చేసారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి …
Read More »వృద్దురాలైన ఆనాద మహిళను శరణాలయంలో చేర్పించాలి : మంత్రి పేర్ని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక భొజ్జల్లి పేటకు చెందిన వృద్ధురాలు చిత్తజల్లు కోటేశ్వరమ్మ తనకు ఆదరించే వారు ఎవ్వరూ లేరని ఆనాదనని సాయం చేయాలని మంత్రిని కోరగా ఈమెకు కోవిడ్ టెస్ట్ చేయించి ఆనాద సర్టిఫికెట్ తీసుకుని …
Read More »జిజిహెచ్ లో వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిజిహెచ్ లో నెలకు 2400 మందికి అత్యవసర వైద్యం అందిoచేందుకు అవసరమైన మందులు, మాస్కులు, అత్యవసర ఇంజెక్షన్స్, వెంటిలాటర్స్, ఆక్సీజన్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. స్థానిక జి జి హెచ లో శుక్రవారం రాత్రి ఆస్పత్రి అభివృద్ధి, వైద్య సేవలు తదితర అంశాలపై కలెక్టర్ నివాస్ అధికారులతో సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఐ సీయూ నిర్వహణ కు అవసరమైన అన్ని సదుపాయాలు …
Read More »కొండప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండప్రాంతం లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్న యెడల వైస్సార్సీపీ కార్పొరేటర్ ల దృష్టికి తీసుకువస్తే తగు పరిష్కరానికి కృషి చేస్తామని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 6 వ డివిజిన్ బ్రహ్మానంద వీధిలో కొండచరియలు విరిగిపడి నిరుపేద కుటుంబలకు చెందిన దివ్య,లక్ష్మీ ల నివాసాలు దెబ్బ తిన్న విషయం స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ …
Read More »తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఈవో తనిఖీలు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో తనిఖీల సందర్భంగా సూచించిన పలు పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దక్షిణ మాడ వీధిలో పచ్చదనం పెంచేలా, అవసరమైన ఇతర ప్రాంతాలు, కాటేజీల మధ్యభాగంలో ఉద్యానవనాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులు నడిచే ఫుట్‌పాత్‌లలో విరిగిన టైల్స్ స్థానంలో …
Read More »వృద్దాశ్రమాలకు ఆనందయ్య మందు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీపీఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో వాంబే కాలనీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులందరికి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ హాజరై సీపీఐ వారు చేస్తున్న కరోనా సేవా కార్యక్రమాలను కొనియాడి అభినందించారు. నగర కార్యవర్గ సభ్యుడు కె.వి.భాస్కరరావు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనే దృక్పధంతో అందరికి మందు ఇవ్వడం జరిగిందని, అందరూ బాగుంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఉచితంగా అందచేస్తున్న ఆనందయ్య …
Read More »
Prajavartha Online Telugu News