Breaking News

Daily Archives: October 13, 2024

శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి సందర్భముగా దేవి చౌక్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకొని  పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా  దేవి చౌక్ లో కొలువై ఉన్న  శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుమార్తె …

Read More »

సోమవారం జిఎంసి లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 14వతేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

ఈ నెల 14వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మద్యం షాపులకు ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వేలం పాటలు నిర్వహించుటకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక హిందూ కళాశాల పీజీ సెంటర్, ఎంబీఏ బ్లాక్ నందు జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కౌంటర్ కు పరిశీలకులను …

Read More »

ప్రశాంతంగా ముగిసిన తొమ్మిదవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా తొమ్మిదవ రోజు అనగా 13/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం మైనర్ మీడియా అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 19576 మందికి గాను 17272 మంది అభ్యర్థులు అనగా 88.23 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 44 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12637 మందికి గాను 11165 మంది అనగా 88.35- శాతం …

Read More »

మూడో రోజు నారీ శక్తి విజయోత్సవ సంరంభం

-బబ్బూరు గ్రౌండ్స్ లో మూడో రోజు ఆధ్యాత్మిక శోభ -ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -భక్తి పారవశ్యంతో తిలకించిన ప్రజలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నారీ శక్తి విజయోత్సవంలో భాగంగా మూడో రోజు పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. నారీ శక్తి విజయోత్సవంతో ఆదివారం ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరారింది. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అబ్బుర పరచాయి. గిరిజన సాంప్రదాయ కొమ్ము నృత్యం: గిరిజనుల్లో ప్రత్యేకించి …

Read More »

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి….

-ప్రభంజనంలా భవానిలా రాక… -ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ -డాక్టర్ జి. సృజన, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజు ప్రారంభమైన భవానీ మాలధారుల ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో భవానీలు జై భవాని….. జై జై భవానీ…….నామ స్మరణతో ఇంద్రకీలాద్రి వైపు అడుగులేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సమానంగా భవానిమాల దీక్షధారుల సంఖ్య ఉండటంతో వారికి …

Read More »

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

-గ్రామీణాభివృద్ధికి గొప్ప ప్రోత్సాహం: రాజస్థాన్‌కు రూ.1267 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.988 కోట్లకు పైగా మొదటి విడత నిధులు విడుదల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బీలు), 2024–25 ఆర్థిక సంవత్సరానికి, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో మొదటి విడతను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ₹395.5091 కోట్ల షరతులు లేని నిధులు (అన్‌టైడ్ గ్రాంట్లు), ₹593.2639 కోట్లు షరతులతో కూడిన నిధులు (టైడ్ గ్రాంట్లు) విడుదలయ్యాయి. రాష్ట్రంలోని అర్హత గల 9 కార్పొరేషన్లు, …

Read More »

కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తజన సందోహం ఎక్కువగా ఉన్నందున, ఈ సోమవారం నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని గమనించవలసిందిగా కోరారు.

Read More »

అమ్మవారి భక్తులకు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం రాత్రి దసరా నవరాత్రులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాట్లను సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ఏరియా, పరిసర ప్రాంతాలు మొత్తం పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక శాతంలో ఉండటం గమనించి, అక్కడనుండి దసరా నవరాత్రుల ఉత్సవ విధుల్లో ఉన్న ఫీల్డ్ అధికారులతో మాట్లాడేందుకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ టెలి కాన్ఫరెన్స్లో పారిశుద్ధ్య నిర్వాహణలో …

Read More »