Breaking News

Daily Archives: October 28, 2024

రూ.2.50 ల‌క్ష‌ల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అంద‌జేత‌ కుటుంబ స‌భ్యుల‌కి అంద‌జేసిన ఎంపి కార్యాల‌య సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద రోగుల‌కి వైద్య విష‌యంలో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌ను వైజాగ్ లో వుండ‌టంతో..సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50 ల‌క్ష‌ల లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) లెట‌ర్ ను సోమ‌వారం త‌న కార్యాల‌యంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం ఎ.కొండూరు మండ‌లం గొల్ల‌మంద్ల గ్రామానికి చెందిన న‌ల్లిబోయిన లక్ష్మీ కి బ్రెయిన్ స‌ర్జ‌రీకి అవ‌స‌ర‌మైన వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50 ల‌క్ష‌ల ఎల్.వో.సి లేట‌ర్ ను న‌ల్లిబోయిన …

Read More »

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకం

-మాజీ మంత్రి ఆలపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తున్న జర్నలిస్టుల పాత్ర సమాజంలో ఎంతో కీలకమని మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఓ ప్రయివేటు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ అభినందన సభలో మాజీ మంత్రి ఆలపాటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫెడరేషన్ అక్రెడిటేషన్ జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ఆర్థిక సహకారం …

Read More »

శిశిరం చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లక్ష్మి పురం లోని ఆలపాటి కార్యాలయం లో సోమవారం ఉదయ శిశిరం చిత్రం మోషన్ పోస్టర్ ను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ఆ విష్కరించారు. కృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరి సహ నిర్మాతలు గా సీనియర్ జర్నలిస్టు, వరల్డ్ రికార్డు హోల్డర్ కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో శిశిరం నూతన చిత్రం రూపొందుతుంది. ఈ సందర్భం గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 211 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డి ఆర్. ఓ పెంచల కిషార్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 10 ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక …

Read More »

విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు,పచ్చిమ నియోజకవర్గాల సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పి.ఏ.సి.మెంబెర్,వెస్ట్ ఇంచార్గ్ వేలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు దేవినేని అవినాష్,నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్య రెడ్డి.. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలోపేతానికి కృషి చేయాలి.. జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసుకోవడం …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జిఎంసికి సంబందించిన మార్కెట్లు, సైకిల్ స్టాండ్ లు, మరుగుదొడ్లు, సండ్రీస్ మార్కెట్లలో ఆశీలను నగరపాలక సిబ్బందికి మాత్రమే చెల్లించి రశీదు పొందాలని, దళారులు వసూళ్లకు వస్తే నేరుగా నగర కమిషనర్ కి కాల్ (9440268888) చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన వివిధ …

Read More »

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు సిహెచ్.లోకరాజు, జె.దేవరాజు, ఏ.ముత్తు కుమార్ ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ లను సోమవారం కమిషనర్  కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు …

Read More »

గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలని, క్షేత్ర స్థాయి పర్యటనల్లో సదరు ఫిర్యాదులను నేరుగా పరిశీలిస్తామని, జిఎంసి పరిధి కాని, పరిష్కారం చేయడానికి వీలులేని వాటికి విభాగాధిపతి తగిన వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే నగరంలో 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కమిషనర్ గారు పండరీపురం, అశోక్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, పనులపై అసహనం వ్యక్తం చేసి స్థానిక శానిటేషన్ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయాలని, అరండల్ పేట మెయిన్ …

Read More »