Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 211 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డి ఆర్. ఓ పెంచల కిషార్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి, డి.పి. ఓ  సుశీల దేవి, డి.ఆర్.డి.ఏ పి.డి శోభన బాబు, డ్వామా పి.డి శ్రీనివాసులు తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు రెవెన్యూ శాఖ – 143 సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ – 7, పంచాయతీరాజ్ 19, పోలీస్ శాఖ -5, సెర్ఫ్ -7, స్కూల్ ఎడ్యుకేషన్ – 6, సివిల్ సప్లైస్ – 2, పశు సంవర్దఖ శాఖ -1, ఐ.సి.డి.ఎస్ – 1, కో – ఆపరేషన్ అండ్ కో ఆపరేటివ్ సొసైటీస్ – 1, వైద్య ఆరోగ్య శాఖ – 5, ఎన్.హెచ్.ఏ.ఐ – 2, వ్యవసాయ శాఖ – 1, సమగ్ర శిక్ష – 02, అటవీ శాఖ – 1, మున్సిపల్ డిపార్ట్మెంట్ – 1, ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ -1, ఎస్.పి.డి.సి.ఎల్ -02, డ్వామా -3, ఇరిగేషన్ – 1 వెరసి మొత్తం 211 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *