Breaking News

Daily Archives: May 2, 2026

విజయవాడ పివిపి మాల్‌లో ట్రయంఫ్ (ట్రాకర్ 400) ఘన ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సంస్థ యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ట్రయంఫ్ (ట్రాకర్ 400) మోడల్‌ను విజయవాడలోని పివిపి మాల్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ ప్రోబైకింగ్ సీఈఓ ఎ. శ్రీనివాస్, ప్రోబైకింగ్ జీఎం సురేష్ కుమార్, ఏపీ ప్రోబైకింగ్ స్టేట్ హెడ్ హరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో బైక్ ప్రేమికులు, కస్టమర్లు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, ప్రీమియం …

Read More »

పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10 వ (ఎస్ ఎస్ సి) తరగతిలో ఆనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా …

Read More »

ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్, మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలనా ప్రత్యేక అధికారి డీకే బాలాజీ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తన సిబ్బందితో సహా ఎలక్ట్రిక్ సైకిల్ పై స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నగరంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి గ్రీన్ స్పాట్లను, చెత్తాచెదారాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా 37, 38, 39 డివిజన్లలో పరాసుపేట, గాదె వారి …

Read More »

విద్యార్థులూ… మీ విజయం స్ఫూర్తిదాయకం

-పదవ తరగతి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు సత్కారాలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులూ… మీ విజయం స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షలు – 2026లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయుల అభినందన సభ ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను భవిష్యత్తు దిశగా మార్గ నిర్దేశకత్వం చేశారు. జిల్లాను గర్వకారణంగా నిలిపారని …

Read More »

జిల్లాలో 1,280 చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 1,280 చేనేత కార్మిక కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు సి.హెచ్.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చేనేత కళాకారుల కుటుంబాలకు, పవర్ లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. హామీ ఇచ్చిన మేరకు 2026 ఏప్రిల్ 1 నుంచి అర్హులైన చేనేత కళాకారుల కుటుంబాలకు 2 వందల యూనిట్ల మేర, పవర్- …

Read More »

ఏపీలో ఎక్కడా విద్యుత్ అంతరాయాలు ఉండడానికి వీల్లేదు : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ అంతరాయాలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశమున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే పునరుద్ధరణ …

Read More »

ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారం

-మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ స‌స్పెన్ష‌న్‌ -ప్రిన్సిపల్, మ‌రో ప్రొఫెస‌ర్ ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్‌ -ఆయుష్ ఇoఛార్జ్ క‌మీష‌న‌ర్ రోణంకి గోపాల‌కృష్ణ వెల్ల‌డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ నోరి రామ‌శాస్త్రి ప్ర‌భుత్వ ఆయుర్వేద వైద్య క‌ళాశాల‌లో లైంగిక వేధింపుల సంఘ‌ట‌న‌కు సంబంధించి వైద్యారోగ్య శాఖ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. డాక్ట‌ర్ డి.మౌళి నాయ‌క్‌ (మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌), ల్యాబ్ టెక్నీషియ‌న్ కె.వి.సుబ్ర‌హ్మ‌ణ్యంల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఆయుష్ ఇన్‌ఛార్జ్ క‌మీష‌న‌ర్ రోణంకి గోపాలకృష్ణ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే విధుల నిర్వహణలో …

Read More »

“టెలీ మానస్’ కేంద్రాలతో మానసిక రోగులకు స్వాంతన

-“14416” హెల్ప్ లైన్ కు మహిళల నుంచి అత్యధిక కాల్స్ -విజయవాడ, విశాఖలోని టెలీ మానస్ కేంద్రాల ద్వారా 365 రోజులు 24 గంటల సేవలు! -మంత్రి సత్యకుమార్ సమీక్ష -ప్రతి కాల్ ను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు ‘టెలీ మానస్’ (హెల్ప్ లైన్ నెంబరు-14416) కేంద్రాల ద్వారా స్వాంతన పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల పటిష్టమైన ఈ కేంద్రాల ద్వారా నెలకు సుమారు …

Read More »

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని భీమనవారిపేట లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది… 46, 47 డివిజన్ల ప్రజల కోసం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.., శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు …

Read More »

నిరుద్యోగులకు ‘ఉద్యోగ భారత్’ చేయూత

-చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు -ప్రతి జిల్లాకు చైర్మన్ల నియామకం -ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటిపాటి జాన్ వెస్లీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ‘ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్’ మిషన్ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటి పాటీ జాన్ వెస్లీ తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో నిరుద్యోగ యువతకు ఈ మిషన్ ద్వారా నైపుణ్య …

Read More »