Breaking News

Monthly Archives: May 2026

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన …

Read More »

మంగంపేట బైరైటీస్‌ గనుల లీజు టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి

-బ్రాండిక్స్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి -ఎన్నికల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లు పెంచిన మోదీ -ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, రాయితీలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని మంగంపేట బైరైటీస్ గనుల సంస్థ కేవలం ఏడాదిపాటు లేదా రెండేళ్లలోపే నడిచే పరిస్థితి ఉందని, అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ …

Read More »

పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

-మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు -గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం -సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా -ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు …

Read More »

మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేషీ అధికారులకు ఆదేశం -భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని చేసేందుకు వెళ్లిన అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళ పని ప్రదేశంలో వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వీడియో సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడన్నా అంటూ …

Read More »

బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్ధ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : టాలీవుడ్ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్ధ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు… కాబోయే దంపతులు చిలుకూరి సూర్యతేజ, జననిలను ఆశీర్వదించారు.

Read More »

చేనేతలకు ఆదాయం, ఆరోగ్యం.. ఇదే కూటమి లక్ష్యం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సోమందేపల్లి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేతలకు ఏడాది పాటు అధిక ఆదాయంతో కూడిన ఉపాధి కల్పనతో ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంతో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను పెంచడంతో పాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా టెక్స్ టైల్స్ పార్కులు, మెగా, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన …

Read More »

మంత్రి లోకేశ్ చొరవతోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

-ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు -కూటమి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థ -మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న చర్యల కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …

Read More »

పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్

-పత్రికా రంగానికి, జర్నలిస్టులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్ట్ ఒక సామాజిక యోధుడని, పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు వంటిది అని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ, పత్రికా రంగానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో …

Read More »

ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ మూల స్తంభం

– పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛ అనేది అత్యంత విలువైన స్తంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా వెలిబుచ్చే స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజం సజావుగా ముందుకు సాగుతుందని అన్నారు. సమాజంలోని అన్యాయాలు, అవినీతి, అసమానతలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించే పాత్రికేయుల సేవలు అపారమని …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …

Read More »