Breaking News

Daily Archives: October 3, 2026

ఆంధ్రప్రదేశ్ కు ఐఐటీయన్ల మేధస్సు

-వరల్డ్ పాన్ ఐఐటీ కౌన్సిల్‌కు వేదికగా అమరావతి -డీప్ టెక్ స్టార్టప్ ల కోసం రూ.500 కోట్లతో పాన్ ఐఐటీ వెంచర్ ఫండ్ -100 మందితో గ్లోబల్ ఐఐటీ మెంటర్ల నెట్ వర్క్ -ఏపీకి టెక్నాలజీని ట్రాన్సఫర్ చేసేందుకు 23 ఐఐటీల అంగీకారం -పాన్ ఐఐటీ ఏపీ 2026 సదస్సులో సీఎం సమక్షంలో డిక్లరేషన్ విడుదల -క్యు-శివ పేరుతో ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు -2027 ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం

-చంద్రబాబుకు ఇప్పుడు యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది -పాలసీలు కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకునేలా ఉండాలి -పరిశ్రమదారులను మేం జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నాం -పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం ఇప్పటివరకు చూడని మార్పు, అభివృద్ధి, సుపరిపాలనని తీసుకురావడానికి మేము తపన పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు మా టీం ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి …

Read More »

పేదల గృహ నిర్మాణంలో మరో కీలక అడుగు

-3 లక్షల ఇళ్లకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి రేపు భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు -తెనాలిలో 3డి కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. మరింత మందికి లబ్ది కలిగేలా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలి …

Read More »

దివ్యాంగులకు అండగా ఉందాం.. భవిష్యత్తుకు ధైర్యాన్నిద్దాం

-రూ.30 లక్షల గెయిల్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో సహాయ పరికరాల పంపిణీకి శ్రీకారం -బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్‌ స్టిక్స్‌ కోసం నమోదు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు అండగా నిలిచి వారి భవిష్యత్తుకు ధైర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. గెయిల్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.30 లక్షలతో దివ్యాంగులకు …

Read More »

వికసిత్ బందరు సాకారం చేయడమే నా లక్ష్యం

-మచిలీపట్నం పూర్వ వైభవాన్ని పొందేలా అభివృద్ధి చేస్తా -పర్యాటకం, పారిశ్రామికంగా అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటాం -బందరు పట్టణంలో పర్యటన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరుకి మంచి జరగాలనే సత్సంకల్పంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని పలు వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలుగా కోరుకుంటున్న బందరు పోర్టును త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నాం. …

Read More »

కూటమి పాలనలోనే పల్లెల్లో ప్రగతి

-రూ.330 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు -బందరు చరిత్రని పునరుద్దరించేలా పర్యాటక అభివృద్ధి -మచిలీపట్నం రూరల్లో రూ.19 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా నిత్యం కృషి చేస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మచిలీపట్నం రూరల్ మండలం వాడపాలెంలో రూ.1.56 కోట్ల …

Read More »

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ప్రొద్దుటూరు/కడప, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్ల జల జీవన్ మిషన్ నిధులతో తాగునీటి కల్పన ప్రాజెక్టును ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలో ఉన్న అన్ని నియోజక వర్గాల నుంచి లక్ష మందికిపైగా ప్రజలు తరలొస్తున్నారన్నారన్నారు. సీఎం,డిప్యూట సీఎం రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలొస్తుండడడంతో …

Read More »

264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు కొత్త భవనాలు సిద్ధం

-24 జిల్లాల్లో 87 నియోజకవర్గాల్లో భవనాల రెడీ -అక్టోబరు 6న గుడివాడలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం -రూ.103.16 కోట్ల వ్యయంతో నిర్మాణం -ప్రారంభోత్సవ కార్యక్రమం పై ఎమ్మెల్యేలకు ఆహ్వాన లేఖలు పంపిన మంత్రి -డిసెంబరు నాటికి మరో 2,750 భవనాలు పూర్తి చేయాలని లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే వైద్య సేవలందిస్తున్న 264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు)కు రూ.103.16 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త …

Read More »

ఈడీ తలుపులు కొడుతున్నా గొడ్డలి పార్టీ అధినేత ఎందుకు నోరు విప్పడు?

– ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈడీ తలుపులు కొడుతున్నా గొడ్డలి పార్టీ అధినేత ఎందుకు నోరు విప్పడని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ప్రశ్నించారు. నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు దర్యాప్తులో ఆధారాలన్నీ నేరుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని రాకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర …

Read More »

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి… : APCC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ APCC ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రరత్న భవన్‌ వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. APCC అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి పీవీ మోహన్‌, AICC కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఓటు విషయంలో పేద, ధనిక అనే తేడా లేదని అన్నారు. …

Read More »