Breaking News

రాజమహేంద్రవరంలో A4 మద్యం దుకాణాల లాటరీ/వేలం ప్రక్రియ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలో రేపు (08-10-2026) 8:00. AM . A4 మద్యం దుకాణాల ఎంపిక/వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని సంబంధిత A4 షాపులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా మొత్తం 90 దరఖాస్తులు నమోదు కాగా, 30 దరఖాస్తులు తుది సమర్పణ (Final Submission) చేయబడ్డాయి.
యూనిట్ వారీగా దరఖాస్తుల వివరాలు
క్రమ సంఖ్య గెజిట్ సీరియల్ నం. యూనిట్ పేరు నమోదు చేసిన దరఖాస్తులు తుది సమర్పించిన దరఖాస్తులు
1). EG/36 బిక్కవోలు 14 4
2 EG/62 కడియం 42 13
3 EG/70 కొవ్వూరు మండలం 15 4
4 KSM/110 మండపేట రూరల్ మండలం. 19 9
మొత్తం 90 30
రేపు నిర్వహించనున్న A4 షాపుల ఎంపిక/వేలం ప్రక్రియ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.
తుది సమర్పణ చేసిన అర్హత కలిగిన దరఖాస్తుదారులు సంబంధిత అసలు పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలతో నిర్ణీత సమయానికి రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావలసిందిగా సూచించారు.
A4 షాపుల ఎంపిక/వేలం ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *