రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో, రాజానగరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి అపరంజి జోష్ణ అధ్యక్షతన, అక్టోబర్ 11 ను పురస్కరించుకొని ఈరోజు ది 07-10-2026 న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడియం నందు అంతర్జాతీయ బాలిక దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సాధికరిత అధికారిని టి శ్రీదేవి మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రాధాన్యతలను గూర్చి, బాలిక విద్య గూర్చి, సాధికారిక గూర్చి, బాలల హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఏ విధంగా నిర్వర్తించాలి అనే విషయాలను గూర్చి, ప్రముఖ మహిళా మణుల జీవిత చరిత్రను గూర్చి విద్యార్థులకు వివరించి అవగాహన కలిగించడం జరిగింది. అలాగే జంక్ ఫుడ్స్ వల్ల కలిగే వివిధ రకాల అనర్ధాలను వివరించి వాటికి దూరంగా ఉండేలా చైతన్య పరచడం జరిగింది.. అలాగే పోషన్ మాసం 2026 క్యాంపైన్లో భాగంగా స్థానిక గర్భిణీ స్త్రీలను పిలిపించి వారికి శ్రీమంతాలు ఏర్పాటు చేసి గర్భిణీ సమయంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలను గూర్చి జాగ్రత్తలను గూర్చి సవివరంగా వారికి తెలియజేసి వారిని చైతన్య పరచడం జరిగింది… జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి కౌన్సిలర్, సిహెచ్ అభి షాలోమ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలిక దినోత్సవం చరిత్ర గూర్చి దాని ప్రాధాన్యతలను గూర్చి ఈ అంతర్జాతీయ దినోత్సవం యునైటెడ్ నేషన్ ప్రకటించిన థీమ్ “బాల్యవివాహాలను అంతం చేద్దాం బాలిక హక్కులను రక్షిద్దాం,” అనే అంశం గూర్చి వివరించి బాల్యవివాహాలు మరియు బాలల హక్కులను గూర్చి వివరించి, అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్రను తెలిపి బాలికలను చైతన్య పరచడం జరిగింది.. అలాగే బాలల కొరకు ఏర్పాటు చేయబడిన చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 గురించి కూడా వివరించడం జరిగింది… ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఉమా జానకి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్, స్థానిక సూపర్వైజర్స్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి శ్రీ ఆర్ అనంత ప్రదీప్ మరియు సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 సిబ్బంది, క్రాఫ్ట్ ఎన్జిఓ జిల్లా కో-ఆర్డినేటర్ అలాగే అంగన్వాడి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News