విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా VOGS (VIJAYAWADA OBSTETRICS & GYNECOLOGY SICIETY) ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ గురువారం డాక్టర్లు వెల్లంకి శ్రీదేవి, వి.వి.సుజాతల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాలలో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని, అయితే చాలా సందర్భా లలో ఆ హింస సమాజా నికి తెలియడం లేదని అన్నారు. మహిళా హింస అంటే ఏమిటి?, ఎలా ఎదుర్కొనాలి? ఎలాంటి శిక్షలు మహిళా హింసకు ఉంటాయనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా విజయవాడ, తిరువూరు, నూజివీడు ఆగిరిపల్లి కొండపల్లి మంగళగిరి, గన్నవరం, ఉయ్యూరు, తెనాలిలో గల విద్యాలయాలు అన్నింటిలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం 60 విద్యాసంస్థ లలో 12,500 మంది విద్యార్థులకు, 400 మంది ఉపాధ్యాయు లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వచ్చిం దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్.సౌజన్య, ఆర్.సోమలత, ఎం.విజయ, వి.చందన, వై.సునీత, ఎన్.అశ్విని, టి.సుమవర్ష, బి.నవీన, ఎం.పూజిత, వి.పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News