Breaking News

గాంధేయ వాదులు ఏకం కావాలి

-మహనీయుల జ్ఞాపకాలను కాపాడుకుందాం
-మన వారసత్వ సంపన్నత ను కాపాడుదాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధేయవాదులు ఏకం కావాలని, మన వారసత్వ సంపన్నతను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఏపీ సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు నీలం రాంబాబు నాయడు, జాతీయ అధ్యక్షుడు చందన్ పాల్, మేనేజింగ్ ట్రస్టీ షేక్. హుస్సేన్ అన్నారు. గురువారం విజయవాడ జింఖాన గ్రౌండ్ లో ఏపీ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో సామాజిక సత్యా గ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారణాసి(కాశీ) లో 1948 లో సర్వ సేవా సంఘ్ 12.89 ఎకరాల సొంత స్థలం కొనుగోలు చేసిందన్నారు. ఆ స్థలంలో మహనీయులు మధుర జ్ఞాపకాలతో కూడిన గాంధీ సామాజిక సేవా కుటీర సముదాయాలు(సర్వ సేవా సంఘ్ కాంప్లెక్స్) సుమారు 42 పురాతన కట్టడాలను, మహనీయుల జ్ఞాపకాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసి, ఆ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఈ ఘటన ను ప్రతిఘటిస్తూ దేశ వ్యాప్తంగా గాంధేయ వాదులంతా ఏకమై సత్యా గ్రహ దీక్ష చేస్తున్నారని తెలిపారు. వారణాసి లో 100 రోజుల సత్యా గ్రహ దీక్షలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగానే మన విజయవాడ జింఖాన గ్రౌండ్ లో ఉదయం 6 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు దీక్ష చేపట్టామని చెప్పారు. ఏపీలో గాంధేయ వాదులను ఏకం చేసి సామాజిక సత్యాగ్రహ దీక్ష చేపట్టామని అన్నారు. మన స్వతంత్ర సాధించుకునే క్రమంలో ఎన్నో ఆయుధ, సాయుధ, శాంతియుత పోరాటాలు జరిగాయని, వాటి ద్వారా మహాత్మా గాంధీజీ, ఆచార్య వినోభా భావే, సుభాష్ చంద్రబోస్, చంద్ర శేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సరోజిని నాయడు, లాల్ బహదూర్ శాస్ర్రి, జయప్రకాష్ నారాయణ్ లాంటి ఏంతో మంది మహనీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించిన స్వాతంత్రం లో మనం అనుభవిస్తున్నామన్నారు. వారు వదిలిన వెళ్లిన జ్ఞాపకాలను మెల్లమెల్లగా చెరిపేసుకుంటున్నామని అన్నారు. అందుకే మననంతా ఏకమై, మనవంతు కర్తవ్యంగా మన ప్రజలను, మన ప్రభుత్వాలను జాగృతం చేసి మహనీయులు మనకు వారసత్వం విడిచి వెళ్లిన సామాజిక, సాధికారిక చిహ్నాలను, వారి మధుర జ్ఞాపకాలను సంరక్షించుకోవాలని చెప్పారు. ఇదే అందరి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గాంధేయవాదులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *