Breaking News

చేనేత అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక కృషి

-చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖా రాణి
-హైదరాబాద్ లో “సేవ్ ది వీవ్” చేనేత ప్రదర్శన ప్రారంభం
-హాజరైన నటి రేణు దేశాయ్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, చేనేత వస్త్రం అమ్మ చల్లని ఒడి వంటిందని రేఖా రాణి అభివర్ధించారు. ఆంద్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ 6- రోజుల చేనేత వస్త్ర ప్రదర్శన ను రేఖా రాణి గురువారం ప్రారంభించారు. నటి, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ వ్యవస్థాపకురాలు రేణు దేశాయ్ జ్యోతి ప్రజల్వన చేశారు. రేఖా రాణి మాట్లాడుతూ భారతీయ సంస్క-తిలో చేనేతకు ప్రత్యేక స్ధానం ఉందన్నారు. ప్రాచీన కళ గా ఉన్న చేనేత కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ నేటి యువత బాధ్యతగా చేనేతను ఆదరించి, ప్రోత్సహించాలన్నారు. రూమ్9, సెలేబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ కొనసాగుతున్న ప్రదర్శనలో ఆంద్రప్రదేశ్ లో ని అనేక జిల్లాల నుండి ఇక్కడ హ్యాండ్ లూమ్ , పట్టు, కాటన్, డ్రెస్ మేటీరియల్స్, హ్యాండిక్రాప్ట్స్ వంటి వేలాది రకాల వస్త్రోత్సత్తులు అందుబాటులో ఉంచారని వివరించారు. పద్మశ్రీ పద్మజా రెడ్డి, సామాజికవేత్త విలేఖ బోయపాటి, నటి ప్రగతి మహావాది, కాలా తాటికొండ – డా. నిర్లేపా క్రొవ్విడి, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాల లత మల్లవరపు, తెలంగాణ అదనపు కార్మిక కమిషనర్ డాక్టర్ ఈ.గంగాధర్, తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *