విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమిషనరు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి సూచనలు మేరకు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో యన్ హెచ్ యం క్రింద పూర్తిగా తాత్కాలిక పద్దతిన ఒక సంవత్సరం పాటు 13 మంది వైద్యాధికారులను నియామకానికి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మచిలీపట్నం డియం హెచ్ ఓ కార్యాలయంలో తమ ధరఖాస్తులు సమర్పించాలన్నారు. మిగిలిన వివరాలకు krishna.ap.nic.in వెబ్ సైట్లో పరిశీలించవచ్చన్నారు.
