గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
36వ వార్షికోత్సవ సందర్భంగా ఏ.పి గెట్ హెల్దీ అనే నినాదంతో కోస్టల్ కారిడార్ లో గుంటూరు,ఒంగోలు,విజయవాడ మరియు ఏలూరు లలో 925 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను సమాజంలో పౌరులందరికీ అందిస్తుంది. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(JCI ) వంటి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ గుర్తింపు ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు,అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు,అధునాతనమైన వైద్య చికిత్సలు అందించడం ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగ పటంలో “ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్,గుంటూరు” పేరు చేర్చబడటం ఎంతో గర్వ కారణం. ఈ సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్దియాలజిస్ట్ డాక్టర్.పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ తమ సంస్థ అనుసరించే విధానాలు మరియు ప్రణాళికల గురించి వివరించారు.
భవిష్యత్ ప్రణాళికలు
భారతదేశంలోనే ఆరోగ్య సంరక్షణలో 3 వ అతి పెద్ద దిగ్గజ సంస్థలైన ఆస్టర్ డి.ఎం. హెల్త్ కేర్ మరియు కేర్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో నిష్ణాతులైన వైద్య నిపుణుల బృందంతో అత్యాధునికమైన వైద్య చికిత్సలను ఆంధ్రప్రదేశ్ లో అందిస్తున్నామని “టావి,మైట్రా క్లిప్ వంటి గుండె శస్త్ర చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఇంటర్వెన్షన్ విధానంలో చికిత్సలను ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో మొట్ట మొదటి సారిగా చేశామని తెలియచేసారు.
త్వరలో అవయవ మార్పిడి,క్యాన్సర్ మరియు క్వాటరినరీ కేర్ హాస్పిటల్
ఇప్పటికే 30 వరకు కిడ్నీ మరియు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలను నిర్వహించామని క్లిష్ట తరమైన గుండె,ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలతో పాటు అత్యాధునిక క్యాన్సర్ సెంటర్ ను కూడా త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని, అదేవిధంగా రాజధానిలో అంతర్జాతీయ స్థాయి క్వాటరినరీ కేర్ హాస్పిటల్ ను తీసుకువస్తామని తెలియచేసారు.
ప్రభుత్వ భాగస్వామ్యంతో “క్లౌడ్ డాక్స్ రమేష్” టెలి ఐ.సీ.యు ద్వారా మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు
డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ టెలి ఐ.సీ.యు ప్రాజెక్టు అయిన “క్లౌడ్ డాక్స్ రమేష్” ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలైన రంపచోడవరం మరియు పాడేరు ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలలో ప్రభుత్వ సహకారంతో వైద్య సేవలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సలహాలను మారు మూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రమేష్ గ్రూపు లో ఉన్న అన్ని హాస్పిటల్స్ ఐసీయూలో ఉన్న క్రిటికల్ కేర్ పేషెంట్లను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24×7 నిపుణుల పరిశీలనలో ఉంచే సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5G అంబులెన్స్‌ల ద్వారా రోగి తరలింపు సమయంలో రియల్ టైమ్ మానిటరింగ్ అందుబాటులోకి తెచ్చామని రోగిని తరలించే సమయంలో మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
డ్రోన్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )
వైద్య రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పెంచడంలో భాగంగా, అత్యాధునిక డ్రోన్ సేవలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అలాగే, AI ఆధారిత సి.టి. యాంజియోగ్రామ్, AI ECG, AI ఎకో, AI MRI వంటి టెక్నాలజీలతో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమయానికి వైద్యం అందించడం సాధ్యమవుతుందని ఆధునిక టెక్నాలజీ సాయంతో రోగుల ఆరోగ్య ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయనే విశ్వాసాన్ని డాక్టర్. రమేష్ బాబు వ్యక్తం చేశారు.
అకడమిక్ ఇన్స్టిట్యూట్‌గా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య సేవలకే పరిమితం కాకుండా, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తింపుతో స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు వైద్య విద్యను అందించే అతి పెద్ద అకడమిక్ ఇన్స్టిట్యూట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తింపు పొందిందని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు.
ఆరోగ్యశ్రీ,,ఆరోగ్యభాగ్యం మరియు ప్రతి మంగళవారం ఉచిత వైద్య సేవలు
ఎన్.టి.ఆర్ వైద్య సర్వీసుల ద్వారా 20 వేలమందికి పైగా గుండె వైద్య చికిత్సలు నిర్వహించామని, ఆరోగ్య భాగ్యం స్కీమ్ ద్వారా అల్పాదాయ వర్గాలకు కూడా ఎకానమీ వైద్య సేవలందిస్తున్నామని 36 వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు,ఒంగోలు,విజయవాడ, ఏలూరు మరియు 25 అవుట్ రీచ్ సెంటర్లలో కూడా ప్రతి మంగళవారం ఉచిత కన్సల్టేషన్ మరియు రాయితీలతో వైద్య పరీక్షలు అందించడానికి నిర్ణయించామని డాక్టర్.రమేష్ బాబు తెలియ చేసారు.
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వివిధ రంగాలలో ఉన్న 75 మంది వైద్యులు పాల్గొన్న ఈ ఉచిత వైద్య శిబిరంలో 1700 మంది గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు వైద్య సేవలు పొందారని డాక్టర్.రమేష్ బాబు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మమత రాయపాటి, గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.