విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్.ఓ.సి పత్రాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ మోహన
రాష్ట్రంలోని పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ అన్నారు.
ఆదివారం ఉదయం తూర్పునియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 2 వ డివిజన్ కు చెందిన గారపరెడ్డి కనకదుర్గకు రూ.60,000, 15 వ డివిజన్ కు చెందిన బోడె స్పందనకు రూ.50,000, 12డి వ విజన్ కు చెందిన మల్లంపాటి వసుంధరకు రూ.2,50,000 సిఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసి పత్రాలను మరియు 12 వ డివిజన్ కు చెందిన వక్కపట్ల వృషద్రీపతికి రూ.59,200 లు, 12 వ డివిజన్ కు చెందిన గంధం అరుణకు రూ.32,833లు, 15 వ డివిజన్ కు చెందిన అబ్ధుల్ సర్థార్ కు రూ.30,541, 15 వ డివిజన్ కు చెందిన పునపు మంజుల కు రూ.35 వేలు సిఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్వయంగా వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సలకు అయిన నగదును సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆరోగ్య సేవలకు అయిన ఖర్చులను అందజేస్తున్నారని అన్నారు. 2025 జనవరి 1వ తేది నూతన సంవత్సరం రోజున 16 వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కోట్ల రూపాయిలు అందజేసే ఫైలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతకం చేశారని అన్నారు. ప్రతివారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గ పరిధిలోని లబ్ధి దారులకు లక్షల రూపాయలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ చెప్పారు. ఐదు సంవత్సరాల వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకరు లేదా ఇద్దరికీ మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం చేశారని అన్నారు.ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. పేదలు అత్యవసరంగా వైద్య సేవల కోసం అధిక వడ్డీలకు తెచ్చి వైద్య చికిత్సలను చేయించుకుంటారని, అలాంటివారు అప్పులపాలు కాకుండా వారిని కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. పేదరికం నుంచి ప్రజలను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చే చేస్తోందని అన్నారు. ఆ విధంగానే ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. పేదరికం నుంచి పేదలను బయటకు తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలోకార్పోరేటర్లు పొట్లూరి సాయిబాబు,ముమ్మనేని ప్రసాద్,శాయన బుజ్జి,గాదిరెడ్డి అమ్ములు, తుమ్మల శేషుబాబు, చలసాని రమణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News