Breaking News

పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం పోస్టర్ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పియం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంపై రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి గురువారం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువతలో నైపుణ్యాల్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్/స్కీమ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు మాట్లాడుతూ ఈ పథకం క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి SSC , పాలిటెక్నిక్, ఐటీఐ, బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ, బీటెక్ వంటి డిగ్రీలు ఉన్న వారెవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు. దీనికి 21-24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. అప్లై చేసుకునేందుకు క్రింద తెలుపబడిన లింకు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. https://pminternship.mca.gov.in/login/. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి వన్ – టైమ్ ఇన్సిడెంట్ గ్రాంట్ రూ. 6000 మరియు భారత ప్రభుత్వం ద్వారా నెల వారి సహాయం రూ . 4,500 మరియు పరిశ్రమలు ద్వారా రూ. 500 సంవత్సరం పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటర్న్‌ షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. ఇప్పటికే ఉన్న పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 21వ తారీకు లోపు పై తెలుపబడిన లింకు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు . మరిన్ని వివరముల కొరకు ఏపీ ఎస్ ఎస్ డి సి కమాండ్ కంట్రోల్ : +91- 998853335, 8712655686, 8790118349, 8790117279, మరియు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ జి.వి.ఎస్. సాయి కుమార్ : 8074597926 నంబర్ నందు సంప్రదించవచ్చన్నారు .

ఈ కార్యక్రమంలో డీఆర్ఓ షేక్. ఖజావలి , డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, ఆర్డిఓ శ్రీనివాస రావు, జెడ్పి సిఇఓ జ్యోతిబసు, పీడీ డీఆర్ డీ ఏ , విజయలక్ష్మీ , పీడీ డ్వామా శంకర్ , పీడీ హౌసింగ్ ప్రసాద్, సిపిఓ శేషశ్రీ , డిఈఓ రేణుక , డిఎస్ ఓ కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ లక్ష్మీ , జీయంసీ అదనపు కమిషనర్ ఓబులేశు, డీడీ మైన్స్ అండ్ జియాలజీ డి. శ్రీ వెంకట సాయి , గ్రౌండ్ వాటర్ డీడీ వందనం, జిల్లా కో ఆపరేటివ్ అధికారి వీరాచారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు -2025

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ నందు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *