-విజయవాడ నగర పాలక సంస్కరించార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చెత్త సేకరణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, ప్రతిరోజు నిత్యం వ్యర్థ సేకరణ కచ్చితంగా జరుగుతుండాలని, విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 21వ డివిజన్, కృష్ణలంక ప్రాంతం మొత్తం పర్యటించి క్షేత్ర స్థాయిలో పరీసశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యం వ్యర్థ సేకరణ జరుగుతుండాలని, ఆ వార్డ్ లోని తరచూ గా వ్యర్ధాలు వేసే ప్రదేశాలను గుర్తించి, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అదే డివిజన్లో ఏ పి ఎస్ ఆర్ ఎమ్ స్కూల్ వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. ఆహార నాణ్యత లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, పరిశుభ్రతలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అన్నారు.