నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా శని వారం న ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయము, నందిగామ నందు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ , స్వర, కె.యం.ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య,కంటి శిబిరాన్ని నిర్వహించామని RTO యం.పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా RTO యం.పద్మావతి మాట్లాడుతూ డ్రైవరులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి చూపు, బిపి, షుగర్ పరీక్షలు చేయించుకొని తదనుగుణముగా జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రమాదాలు జరగవు అని తెలిపారు. సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె జయ చంద్ర మాట్లాడుతూ ఓవర్ స్పీడ్ గా వాహనమును నడపకూడదని, డ్రైవరు లు యూనీఫార్మ్ లో ఉండవలెను అని, వాహనములకు సంబందించిన పత్రాలు ఫోర్స్ లో ఉంచుకొనవలెను అని, మద్యం సేవించి వాహనములు నడపకూడదని తెలియచేసారు. డాక్టర్ మహేష్ మాట్లాడుతూ రహదారి పై ప్రమాదము జరిగినప్పుడు, ప్రమాద బాదితులను రక్షించడము లో మొదటి 60 నిమిషాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, మరణాలు తగ్గించడానికి చాలా కీలకమైనవి అని, ప్రమాదము జరిగిన వెంటనే ఆ ప్రాంతము లో సంచరిస్తున్న వారు ఎవరైనా బాదితులకు సహాయము చేసి హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లయితే వారిని గుడ్ సమారిటన్ గా గుర్తించి , సహాయము చేసిన వ్యక్తులకు గౌరవ సూచకము గా రూ 5000/-ల పారితోషికము జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ఇవ్వబడును అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో RTO యం.పద్మావతి, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె జయ చంద్ర, పరిపాలన అధికారి BSK ప్రభాకర లింగం, ప్రభుత్వ ఏరియా వైద్యశాల డాక్టర్ మౌనీష్ , కంటి వైద్య నిపుణులు డాక్టర్ యం. శేషుకుమారి, స్వర, కె.యం.ఆర్ హాస్పిటల్ డాక్టర్లు అరవింద్ సూర్య, మహేష్, హాస్పిటల్ సిబ్బంది, అన్నపూర్ణ డ్రైవింగ్ స్కూల్ విధ్యార్ధులు , PSC బోస్ డ్రైవింగ్ స్కూల్ విధ్యార్ధులు, RTO కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.