విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దార్శనికుడు ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగివేమన జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలను వినిపించి అందరిని మెప్పించిన మహాకవి వేమన అని అన్నారు. వేమన ఒక ప్రజాకవి, సంఘ సంస్కర్త అని, ఆయన పద్యాలను వినని వారు, తెలియని వారుండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం, భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు, ట్రైనీ ఐ. పి. ఎస్. మనీషా గారు, సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.