-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్
-అదరహో అనే విధంగా యువతను, ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులు
-కేరింతలతో సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం
-వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్న పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు, యువతతో నిండిపోయిన
సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం.
ఈ నెల 18న శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను సూళ్లూరుపేట నియోజక వర్గంలోని సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ప్రారంభం చేయడం జరిగింది, అలాగే సదరు ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో భాగంగా అటకాని తిప్ప పులికాట్ రక్షిత కేంద్రం నందు ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు, నేలపట్టు పక్షుల అభయారణ్యం నందు ఫెలికాన్ పక్షుల వీక్షణ, స్నేక్ షో ఏర్పాటు, బీవీ పాలెం నందు బోటింగ్, శ్రీ సిటీ నందు పలు మేధావులతో పర్యాటక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి పర్యావరణ హిత అంశాలు, పులికాట్ పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై కాంక్లేవ్ ఏర్పాటు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల ప్రారంభం నుండి ముగింపు వరకు పలు కార్యక్రమాలు, పలు శాఖల స్టాల్స్ ఏర్పాటు, పలు స్థానిక తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, పలు స్థానిక క్రీడలు ఘనంగా నిర్వహించుట కొరకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరిగింది.
జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న 2025 ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలలో భాగంగా వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించుటకు అత్యధిక సంఖ్యలో ఉత్సాహంగా ప్రజలు తరలివస్తున్నారు.
పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్, వైద్య ఆరోగ్య, ఉద్యాన, వ్యవసాయ, డీఆర్డీఏ, మెప్మా, హ్యాండిక్రాఫ్ట్, స్త్రీ శిశు సంక్షేమ, అటవీ, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరి కోట, శ్రీసిటీ, వీనస్ ఆరోగ్య రక్ష వైద్య పరీక్షల స్టాల్ లూనేర్పాటు చేసి వున్నారు. రాష్ట్రంలో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు వాటి విశిష్టత గురించి పర్యాటక శాఖ అధికారులు సందర్శకులకు వివరించారు.
వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సృష్టించడం, పండ్ల తోటలు పెంపకం పై, మరియు పశు సంవర్ధక శాఖ ద్వారా పశు సంపద పాడి పరిశ్రమ ద్వారా రైతులకు ఆదాయం పై రైతులకు సందర్శకులకు అవగాహన కల్పిస్తూ వివిధ పంటలకు సంబందించి అవగాహన కొరకు కరపత్రాలను అందిస్తున్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు అందజేసే పోషక ఆహారానికి సంబందించిన కిట్స్, గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్టాల్స్ సందర్శించిన ప్రజలకు వివరిస్తున్నారు. అటవీ శాఖ స్టాల్ ఏర్పాటు ద్వారా స్టాల్ నందు అడవులను, అటవీ సంపదను రక్షించుకోవడం, అడవి జంతువుల సంరక్షించుకోవడం వంటి అంశాలపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట వారు ఏర్పాటు చేసిన నమూనా స్టాల్స్ నందు విద్యార్థులకు ఉపగ్రహాల ప్రయోగం, ఉపగ్రహ తయారీ వాటి పనితీరుపై విద్యార్థులకు వివరిస్తున్నారు ఈ షార్ వారి స్టాల్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
శ్రీ సిటీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు శ్రీ సిటీ నందు 30 దేశాలకు సంబందించిన 220 కంపెనీలు ఏర్పాటు చేశారని, అందులో 65 వేల మంది పని చేస్తున్నారని, అందులో 52 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని సందర్శకులకు అవగాహన కల్పిస్తూ వివరిస్తున్నారు. బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు బ్యాంక్ అధికారులు ప్రభుత్వం ద్వారా రైతుల వ్యవసాయానికి సంబంధించిన రుణాలతోపాటు బ్యాంకుల ద్వారా అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీనస్ ఆరోగ్య రక్ష వైద్య పథకం కేంద్రం నందు పర్యాటకులకు ప్రజలకు ఉచితంగా బిపి, షుగర్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు.
పాఠశాల ఆవరణలో చిన్న పిల్లలకు, పెద్దలకు సంబంధించిన రంగుల రత్నాలు, జాయింట్ వీల్స్, పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఆడుకునే బొమ్మలు పై పిల్లలు పరిశీలిస్తూ సంతోషంగా ఆనందిస్తున్నారు. జనసంద్రంగా మారిన సూళ్లూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం. నేటి ఆదివారం సాయంత్రం పలువురు మిమిక్రీ, గాయకులు, తారలు తదితరులు పాల్గొని ప్రజలు, పర్యాటకులు, యువత, విద్యార్థినీ, విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సాంప్రదాయ కార్యక్రమాలు మొదలు, వినోద, హాస్య, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పలువురు మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ను అందరి సహకారంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ప్రజలు అందరూ సదరు పర్యాటక ప్రాంతాలని సందర్శించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎంఎల్ఏ గూడూరు పాశం సునీల్ కుమార్, వెంకటగిరి కొరుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎంఎల్సి వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట చైర్మన్ శ్రీమంథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.