మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు మాత్రం ఉదయం 9:30లకే హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Tags machilipatnam
Check Also
రోడ్డు భద్రత పై అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా పడవల రేవు సెంటర్లో …