పేదల సాగులో ఉన్న భూములకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి.

-దేవాదాయ భూముల్లో నివాసముంటున్న నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి.
-రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తరతరాల నుండి అంతర్వేది దేవస్థానం భూములను సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలోని నిడమామిడి జంగం భూమిలో 22 గ్రామాల వారు సుమారు 1000 మంది నివాసం ఉంటున్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు జారీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రెవెన్యూశాఖమంత్రి అనగాని సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రిగారికి విన్నవిస్తూ అంతర్వేదిలో వివిధ దేవాలయాల భూములను సాగుచేసుకుంటూ కేసుదాసుపాలెం, గొంది,శృంగవరపప్పాడు మరియు అంతర్వేది గ్రామాల్లో వందలాది మంది నిరుపేదలు తరతరాలు నుండి భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి శాశ్వతమైన యాజమాన్య హక్కు పత్రాలు జారీచేయలని కోరారు. ప్రస్తుతం ఈ భూములను సాగు చేసుకుంటూ నివాసముంటున్న కుటుంబాలకు కూడా ఇళ్ళుపై ఎటువంటి అధికారం లేదని దేవస్థానం వారు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారని ఇది సరైంది కాదని ప్రభుత్వం జోక్యం చేసుకొని పేదలను ఆదుకోవాలని కోరారు. దీనితోపాటు రాజోలు, గన్నవరం నియోజకవర్గాల్లో దళితులు మరియు గ్రామీణ పేదలు 42 సిపిఎఫ్ సొసైటీలు, ఫీల్డ్ లేబర్ కోపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేసుకొని పంటల పండించుకుని బతుకుతున్నారని ఈ సొసైటీలు భూముల్లో ఉన్న వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ లు జారీ చేయాలని తెలిపారు. వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ అమలు చేస్తున్న పథకాలను వీరికి కూడా వర్తింప చేయాలని కోరారు.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రం రంగాసముద్రం పంచాయతీలో 250 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని వీరికి పట్టాలు మంజూరు చేయాలని, బద్వేల్ పట్టణంలో 11 ఏళ్లుగా దాదాపు 700 మంది నిరుపేదల కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారని ఆయా ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వీరికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు గోపవరం మండలం పిపికుంటలో దాదాపు 500 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారని వీళ్ళందరికీ పట్టాలు జారీ చేయాలని కోరారు. శ్రీ
సత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో సుమారు 20 ఎకరాల భూమిలో వేయి కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని స్థానిక వైసిపి నాయకులు వీరిని బెదిరించి ఇళ్ల స్థలాలు ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, పేదలకు రక్షణ కల్పించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయవలసిందిగా కోరారు. ధర్మవరం మండలంలో కేశవ నగర్ లో గత 15 సంవత్సరాలుగా పేదల నివాసం ఉంటున్నారని వీరందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ విషయంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ స్పందిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ దగ్గర నుండి అంతర్వేది దేవస్థాన భూ సమస్యలపై రిపోర్ట్ తెప్పించుకొని సమగ్రంగా పరిశీలించి సాగు చేసుకుంటున్న కౌలురైతులకు మరియు నివాసం ఉంటున్న నిరుపేదలకు తగిన న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా కడప, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లకు కూడా రిపోర్టులు పంపించి వారి దగ్గర నుంచి సమగ్రమైన సమాచారం సేకరించి నివాసముంటున్న పేదలందరికీ తగిన న్యాయం చేసేందుకు పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఎ ఐ వై ఎఫ్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సురేష్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *