గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని, నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సమావేశం నిర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ తొలుత కార్యదర్శుల వారీగా మిస్సింగ్ సిటిజెన్స్, పి.ఏ.సి.యస్, హౌసింగ్ జియో ట్యాగ్, యన్.పి.సి.ఐ, నాన్ రెసిడెంట్ ఇన్ ఏ.పి, యం.యస్.యం.ఈ సర్వే ల పురోగతి పై వివరాలడిగి తెలుసుకొని, మాట్లాడుతూ సర్వేల వేగవంతం పై కార్యదర్శులు, నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించి గురువారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఇక నుండి సర్వేలను మరియు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ మెరుగైన సేవలను అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సిటిజెన్ డేటాబేస్ ను సిద్దం చేయడానికి, సూక్ష్మ, మధ్యతరగతి వ్యాపార సంస్థలకు రాష్ట్ర మరియు కేంద్ర సంక్షేమ పధకాలు అమలు చేయడానికి సర్వేలు చేస్తున్నామన్నారు. సర్వేకు నగర ప్రజలు పూర్తి స్తాయిలో సహకరించి సచివాలయ కార్యదర్శులకు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
సదరు సమావేశంలో అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమీషనర్ డి. శ్రీనివారావు, సెక్రటరీ పి. శ్రీనివాసరావు, ఆర్.ఓ రెహమాన్, నోడల్ అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.