Breaking News

వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అవసరమైన అంచనాలు రూపొందించి వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు ప్రయోజనకరంగా ప్రతి ఏడాది జూన్ మాసంలో కాలువలకు సాగునీటి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు, ఈలోగా కాలువలు డ్రెయిన్ల లో గుర్రపు డెక్క, తొలగింపు, నిర్వహణ పనులు చేపట్టుటకు అంచనాలు రూపొందించాలని, ఫిబ్రవరి 3 లోగా ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని, తద్వారా ఏప్రిల్ మాసంలోగా పనులు చేపట్టుటకు అనుమతులు, మంజూరులు తీసుకొని మే మాసంలో పనులు చేపట్టి పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు.

కాలువలు, డ్రైన్లు లో తొలగించిన గుర్రపుడెక్క, తూడు ఒకే చోట వేసి కంపోస్ట్ గా తయారయ్యే విధంగా, దీనిని రైతులు తమ పొలాల్లో వినియోగించుకునేలా చేసినట్లయితే రైతులకు ఫెర్టిలైజర్స్ వ్యయం తగ్గి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ విధంగా చేయగలిగితే రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా ఉంటుందన్నారు.

కాలువల శివారు ప్రాంతాలు, లాకుల వద్ద చేరే గుర్రపుడెక్క, తూడు తొలగించి ఒకచోట వేసి కంపోస్ట్ గా తయారవుటకు దానిని కటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు తెలుపగా, వాటర్ యూజర్స్ సంఘాల పరిధిలో తొలగించిన తూడు ఒకే చోట వేసే విధంగా కటింగ్ చేసే విధంగా చర్యలు తీసుకొనుటకు, తయారైన కంపోస్ట్ అక్కడ రైతులు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకొనుటకు గల అవకాశాలు పరిశీలించాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ సూపర్నెంట్ ఇంజనీర్ మోహన్ రావు, డ్రైనేజీ గోపీనాథ్, ఇరిగేషన్ కేఈ డివిజన్ ఈఈ కే. బాబు, కేసి డివిజన్ ఈఈ రవికిరణ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం నుండి ధరఖాస్తులకు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా, బాదంపూడి లో గల దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *