గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు బుధవారం 6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు గారు తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 22 నుండి 24 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉందని, తొలి రోజు బుధవారం 6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అదనపు కమిషనర్ చాంబర్లో సిబ్బందిని కేటాయించామని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ లు దాఖలు చేయవచ్చని తెలిపారు.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …