Breaking News

బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు

-బాలికలు నెలకు కాస్మొటిక్ చార్జీలు కింద రూ. 250 అందిస్తాం : జిల్లా కలెక్టరేట్ డా. ఎస్ వెంకటేశ్వర్
-కార్పొరేట్ వసతి గృహాలకు దీటుగా ఆదర్శ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాలను తీర్చిదిద్దుతాం: శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని, బాలికలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టరేట్ డా. ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తో కలిసి వసతి గృహాలును తనిఖీ చేశారు. అనంతరం వసతి గృహంలోని మరుగుదొడ్లు, డైనింగ్ తదితర పరిసరాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం ను గత నెల గౌరవ శాసనసభ్యులు తనిఖీ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా ధయనీయంగా ఉన్నాయని, తను సొంతంగా పనులు ప్రారంభించి అక్కడ ఉన్న విద్యార్థులకు 48 రోజులలో వసతి గృహంలో ఉన్నటువంటి టాయిలెట్స్, రూమ్స్, కిచెన్ , అన్నింటిని సకల వసతులతో సమకూర్చి , అనుకున్న సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేశారని, విద్యార్థులందరినీ కూడా ప్రశాంత వాతావరణంలో చదువుకోవడానికి వీలు కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజున హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి కావలసినవి అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు కావలసినటువంటి కంప్యూటర్లు, బెడ్లు, వాష్ ఏరియా, 24 గంటల ఇంటర్నెట్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులకు రూ.6 కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తిలోని ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ ని సకల వసతులతో కూడినటువంటి ఆదర్శ వసతి గృహం గా తీర్చిదిద్దారని, జిల్లాలోని మిగిలిన వసతి గృహాలను కూడా ఇదే తరహాలో చేసే విధంగా ఒక కార్యాచరణ మొదలు పెడతామని అన్నారు. సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహము ను ఆదర్శ వసతి గృహంల తీర్చిదిద్దిన శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో నేను ఒక నెల కిందట సాంఘిక సంక్షేమ బాలికల వసతి నీ తనిఖీ చేయగా ఒకప్పుడు అత్యంత దయనీయంగా ఉండేదని.. రెండు నెలలు లోపు హాస్టల్ లోని మౌలిక వసతులను చక్కదిద్దాలని ఆదేశించగా నిర్దేశించిన సమయం కంటే ఒక నెల ముందుగానే వసతి గృహం ను అన్ని వసతులతో తీర్చిదిద్దారని నేడు కలెక్టర్ గారిని ఆహ్వానించి వారిచే వసతి గృహం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ గారు వసతి గృహం ను సందర్శించి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని అత్యధిక వసతులతో కూడిన కంప్యూటర్లు, బెడ్లు, ఆర్వో ప్లాంట్లు, వాషింగ్ ఏరియా, కిచెన్ ఏరియా వంటివి సమకూర్చి బెస్ట్ మోడల్ హాస్టల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. శ్రీకాళహస్తిలో ఏడు హాస్టల్లో ఇదే స్థితిలో ఉన్నాయని, అందులో ఇప్పటికీ నాలుగు హాస్టల్లకు మరమ్మత్తులు చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన మూడు హాస్టళ్లను కూడా ఇదేవిధంగా మోడల్ హాస్టల్ గా తీర్చిదిద్దుతమని , రేపు జరగబోతున్న నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈ మోడల్ హాస్టల్ ను వారికి బహుమానంగా ఇస్తున్నానని తెలియజేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రీకాళహస్తి రూపురేఖల్ని మార్చి మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

విద్యార్థులు మాట్లాడుతూ .. వసతి గృహం దయచేసి స్థితిలో ఉందని, సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడే వాళ్ళమని ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలుపగా వెంటనే స్పందించి వసతి గృహమును రూపురేఖలు మార్చి ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఇంకా మరిన్ని వసతులు కల్పించమని విద్యార్థులు అడగగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వెంటనే పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలోకి తీసుకొస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం బాలికలు వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *