గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించుచున్న జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు తేది: 22.01.2025న విగ్నాన్ యూనివర్సిటి వడ్లమూడి, తెనాలి నందు ఉప రవాణా కమిషనర్ గుంటూరు వారు పాఠశాల / కళాశాల బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని తెలియజేయడమైనది. ప్రతి పాఠశాల మరియు కళాశాల బస్సు డ్రైవర్లు వాహనం యొక్క స్థితిని జాగ్రత్తగా పరిశీలించి వాహనం నడపాలి. వాహనంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, ఆ లోపాన్ని వెంటనే వాహనం యొక్క ఇన్‌చార్జికి నివేదించాలి. 60 ఏళ్లు పైబడిన ఏ డ్రైవర్ అయినా పాఠశాల మరియు కళాశాల బస్సులను నడపడానికి అర్హులు కాదుఅని తెలియజేయడమైనది.ఈకార్యక్రమంలోడ్రైవర్లచేరోడ్డుభద్రతాప్రతిజ్ఞచేయించడం జరిగినది.ఈ కార్యక్రమంలోశ్రీకె సీతారామిరెడ్డి,ఉప రవాణా కమిషనర్ గుంటూరు, శ్రీ టి రాఘవ రావు, మోటర్ వాహన తానీకీ అధికారి,తెనాలి యస్ బి మధుసూధన రావు సహాయ మోటర్ వాహన తానీకీ అధికారి, తెనాలి కళాశాల యజమాన్యం పాల్గొనడం జరిగింది.
ఈ రోజు తేది: 22.01.2025నమంగళగిరిలో “వాకథాన్” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని స్టేక్ హోల్డింగ్ డిపార్ట్‌మెంట్ల పోలీసు శాఖ పాల్గొన్నారు. డ్రైవర్లు సీటు బెల్టులు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారు తెలియజేశారు. డ్రైవర్లు వాహనం ఇన్‌ఫోర్స్‌కు సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలి, బీమా మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. రోడ్డు భద్రతపై విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోడి. యస్. పి. సి హేష్ మురళి కృష్ణ, టౌన్ సి.ఐ. డి వినోద్ కుమార్, టౌన్ సిఐ శ్రీహరిబాబు, బి సత్యనారాయణ ప్రసాద్, ప్రాంతీయ రవాణా అధికారి గుంటూరు, జె అనిల్ కుమార్, మోటర్వాహనతానీకీఅధికారి,గుంటూరు, వి బాలకృష్ణ, మోటర్వాహనతానీకీఅధికారి, గుంటూరు, పి పవన్సహాయమోటర్వాహనతానీకీఅధికారి, మంగళగిరి, కళాశాల మరియుపాఠశాలవిద్యార్థులుపాల్గొనడం జరిగింది.
Tags guntur
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …