గుడిమల్లం, నేటి పత్రిక ప్రజావార్త :
పరశురామేశ్వరాలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారితో కలిసి దర్శించుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి ఆశీర్వచనం అందించారు.
దర్శనం అనంతరం ఆలయ అధికారులు గుడిమల్లం ఆలయం ప్రసిద్ధత గురించి జిల్లా కలెక్టర్, ఎంఎల్ఏ కు వివరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుడిమల్లం లోని పరమేశ్వర ఆలయo అతి పురాతన ఆలయం అని ఈ ఆలయమును ఇంకా అభివృద్ధి లోకి తీసుకొని రావడం వలన పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని, ఆలయ విశిష్టత గురించి ఇంకా ప్రాచుర్యం పెరుగుతుందని అన్నారు. రాబోయే శివరాత్రికి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Prajavartha Online Telugu News