-హెల్మెట్ ధరించకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తాం-.మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
36 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో హెల్మెంట్ ధరించి ద్విచక్ర వాహనాలతో మోటర్ వెహికల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీ ని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు,ట్రాఫిక్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను నడిపే వాహన చోదకులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించాలని తెలియజేశారు. మద్యం సేవించి వాహనాన్ని నడుపరాదని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యడం చాలా ప్రమాదకరమని చెప్పారు. హెల్మెట్ ధరించకుండా బైక్ లు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్,ట్రాఫిక్,ఫైర్ శాఖల కార్యాలయ సిబ్బంది తో పాటు కెసిపి సిమెంట్, మారుతి,బజాజ్,టివియస్,హీరో,హోండా,హుండై,యమహా షోరూం ల సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.