Breaking News

పీఎం సూర్య ఘర్ మంచి పథకం

-జిల్లాలో విరివిగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్య ఘర్ ఎంతో మంచి పథకమని జిల్లాలోని ప్రజలు విరివిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్ ఇప్పటికే వినియోగించుకుని లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఈ పథకం వల్ల వారు పొందిన ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులు స్థానిక చింతగుంటపాలెం కు చెందిన చోడవరపు ప్రసూన, స్థానిక అరవ గూడెంకు చెందిన లబ్ధిదారుడు కొంపెర్ల సుబ్బారావు ఈ పథకం వల్ల తాము పొందిన ప్రయోజనాలు తెలియజేస్తూ మొదట్లో తమకు కరెంట్ బిల్లులు మూడువేల వరకు వచ్చేవని, అయితే ఈ పథకం కింద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నాక కరెంటు బిల్లు చాలా తగ్గిందని, ఇంటి అవసరాలకు పోను విద్యుత్తు మిగులు ఉండడంవల్ల మిగులు యూనిట్లకు ఆదాయం కూడా లభిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఈ పథకం కింద బ్యాంకు రుణ సౌకర్యం కూడా లభిస్తుంది అన్నారు.

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు మాత్రమే ఈ పథకం కింద సబ్సిడీ లభిస్తుందని, కావున ఈ పథకం వినియోగించుకొనుటకు త్వరపడాలని సూచించారు. వివరాల కోసం పీఎం సూర్యఘర్ పథకం జిల్లా నోడల్ అధికారి ఎం.భాస్కరరావు, సెల్ 7780456319 సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత

-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *