అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్),జిఏడి సేవలు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జిఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈమేరకు బాధ్యతలు స్వీకరించారు.ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జిఏడి అధికారులు, పలువురు సచివాలయ అధికారులు,ఉద్యోగులు ముకేశ్ కుమార్ మీనాను కలిసి శుభా కాంక్షలు తెలియజేశారు.
Tags amaravathi
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …