Breaking News

లారీ ఓనర్స్ హాలులో రోడ్డుభద్రతా కరపత్రాలు విడుదల

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరవై శాతం పైగా రహదారి ప్రమాదాలకు వాహనాల లోపాలు కారణం కాదని, మానవతప్పిదాల వల్లే మూడొంతుల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో 36 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కరపత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రహదారి నిబంధనలను పాటించకపోవడం వల్లే గత ఏడాది రాష్ట్రంలో 8 వేల 600 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందగా, ఎన్టీఆర్ జిల్లాలో 413 మంది హెల్మెట్ ధరించకపోవడం తదితర తప్పిదాల వల్ల రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డ్రైవర్లను చైతన్యపరిచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో లారీ యజమానుల సంఘం డ్రైవింగ్ స్కూలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ట్రాఫిక్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ నరేంద్రకుమార్ ట్రాఫిక్ నిబంధనలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 19 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారులు హెల్మెట్ ధరించడంలో, సీటుబెల్టు పెట్టుకోవడంలో అవగాహన కలిగించామని చెప్పారు.
మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి సరైన శిక్షణ అవసరమని, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు, ప్రాణం విలువ తెలియజేసేందుకు ఎంపికచేసిన మాల్స్, స్కూల్స్ దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ సంఘం అధ్యక్షులు నాగుమోతు రాజా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తమ సంగం 1995 నుంచి పోలీసు, రవాణాశాఖలతో కలిసి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు. ప్రధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. రోడ్డుభద్రతపై బుర్రకథ ఆకట్టుకుంది. చివరగా కరపత్రాలు పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎం ఎల్ ఎల్ బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *